Big Boss 5: లోబో పొట్టపై సెటైర్లు.. యానీ మాస్టర్ ఉగ్రరూపం!

సోమవారం ఎలిమినేషన్ తో హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య యుద్ధవాతావరణాన్ని తెచ్చిన బిగ్ బాస్ మంగళవారం ఆ వాతావరణాన్ని కాస్త చల్లబరిచేలా నాటిక, టాస్క్ లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అంతలోనే..

Big Boss 5: లోబో పొట్టపై సెటైర్లు.. యానీ మాస్టర్ ఉగ్రరూపం!

Big Boss 5 (1)

Big Boss 5: సోమవారం ఎలిమినేషన్ తో హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య యుద్ధవాతావరణాన్ని తెచ్చిన బిగ్ బాస్ మంగళవారం ఆ వాతావరణాన్ని కాస్త చల్లబరిచేలా నాటిక, టాస్క్ లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ అంతలోనే కెప్టెన్ కోసం టాస్క్ తో మళ్ళీ కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజేశాడు. ముందుగా ఇంటిలో ఫుల్లుగా వినోదాన్ని పండించే విధంగా సభ్యులు నాటికను ప్రదర్శించగా.. ఇందులో అందరూ కలిసి లోబోను బకరా చేశారు. లోబోతో శ్వేతా వర్మ పెళ్లి చూపులు, లవ్ మ్యాటర్ విషయంపై ఓ చిన్న స్కిట్ ప్రదర్శించగా అందరూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే విధంగా యాక్టింగ్ చేశారు.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో పదిమంది.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

శ్వేతాకు లోబో లైన్ వేస్తుంటే శ్వేతా ఫ్రెండ్ అని తల్లి అనీ మాస్టర్ కి పరిచయం చేస్తుంది. లోబోతో మాట్లాడిన అనీ.. నువ్వు నా కూతురు ఫ్రెండ్ వా.. ఆ పొట్ట ఏంటి.. నీ వయసెంత.. శ్వేతాకి క్లాస్ మేట్ ఎలా అయ్యావంటూ ఆటబట్టిస్తే.. శ్వేతా కోసమే పదేళ్లుగా క్లాస్ మేట్ గానే ఉన్నానని లోబో చెప్పాడు. అయితే.. అనీ మాత్రం తన కూతురు శ్వేతాకి శ్రీరామచంద్ర అనే కుర్రడినిచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంది. శ్రీరామ్ కూడా తనకి ఫ్రెండ్ ఏనని లోబో చెప్పి శ్రీరామ్ గురించి బ్యాడ్ గా చెప్తాడు..

Big Boss 5: ఐదు వారాలకు హమీదా రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీరామ్ లోబోను శ్వేతా తల్లికి లైన్ వేస్తున్నావ్ కదా అంటే అంతలో వచ్చిన రవి.. నీ కోసం అక్కడ నీ కూతురు ఏడుస్తుందని లోబోకి చెప్పడంతో యానీ నీకు పెళ్ళై కూతురు కూడా ఉందా అని ఛీ కొడుతోంది. కూతురు, పెళ్లి అయిందని ముందే చెప్పకుండా ఇరికించారని లోబో చెప్తుంటే హౌస్ మేట్స్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయారు. బిగ్ బోస్ ఇంతలోనే కెప్టెన్ టాస్క్ తో కాకరేపాడు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్‌ ఇచ్చి కంటెస్టెంట్స్‌ ను నాలుగు టీమ్‌లుగా విడగొట్టాడు.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్స్‌గా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్స్‌గా నియమించగా.. వీళ్లే బొమ్మల నాణ్యతని తనిఖీ చేస్తారు. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్‌ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉండగా.. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా యానీ మాస్టర్‌, సిరిల మధ్య మాటల యుద్దం జరిగి యానీ ఉగ్రరూపం దాల్చింది. లాస్ట్‌ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ యానీ మాస్టర్‌ తన అసలు రూపాన్ని బయటపెట్టింది.