Satya Dev : నాకొక పెద్ద థియేట్రికల్ హిట్ కావాలి..

గుర్తుందా శీతాకాలం సినిమాని గ్రాండ్ గానే ప్రమోట్ చేశాడు సత్యదేవ్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సత్యదేవ్ మాట్లాడుతూ.....................

Satya Dev : నాకొక పెద్ద థియేట్రికల్ హిట్ కావాలి..

Satya Dev wants a biggest theatrical hit

Satya Dev :  యువ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో, వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. హీరోగానే కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేసి మెప్పిస్తున్నాడు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా విజయం సాధించిన అనంతరం నేడు ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

కన్నడ లో సూపర్ హిట్ అయిన లవ్ మాక్‌టైల్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో సత్యదేవ్ హీరోగా నటించగా తమన్నా, కావ్యాశెట్టి, మేఘ ఆకాష్ లు హీరోయిన్స్ గా నటించారు. జీవితంలోని మూడు దశల్లో ఉండే మూడు ప్రేమకథలతో ఉండబోతుంది ఈ సినిమా. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన గుర్తుందా శీతాకాలం డిసెంబర్ 9న థియేటర్స్ లోకి వచ్చింది. దీనిపై సత్యదేవ్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.

గుర్తుందా శీతాకాలం సినిమాని గ్రాండ్ గానే ప్రమోట్ చేశాడు సత్యదేవ్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సత్యదేవ్ మాట్లాడుతూ.. ”ఏ సినిమా చేసినా విజయం సాధిస్తుందని నమ్మే చేస్తాం. అన్ని సినిమాలకి ఒకేలాగా కష్టపడతాం. గాడ్సే సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ నా అంచనాలకి విరుద్ధంగా జరిగింది. ఇక గుర్తుందా శీతాకాలం సినిమా విడుదల చాలా ఆలస్యం అయింది. ఈ సినిమా నాకు సహనాన్ని నేర్పించింది. ప్రస్తుతం నా స్థాయిని పెంచుకోవడానికి నాకొక పెద్ద థియేట్రికల్ హిట్ సినిమా కావాలి. గుర్తుందా శీతాకాలం తర్వాత కృష్ణమ్మ, ఫుల్ బాటిల్ సినిమాలతో రాబోతున్నాను, మరో తమిళ్-తెలుగు సినిమా చేస్తున్నాను అని తెలిపాడు.

Kalyan Ram : స్పీడ్ పెంచేసిన కళ్యాణ్ రామ్.. తమిళనాడులో ‘డెవిల్’..

సత్యదేవ్ చెప్పింది కూడా నిజమే. సత్యదేవ్ గొప్ప నటుడని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. నటనలో తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సత్యదేవ్ కి కమర్షియల్ గా ఒక పెద్ద హిట్ కావాలి. తన మార్కెట్ పెంచుకోవాలంటే థియేట్రికల్ హిట్ కచ్చితంగా అవసరం సత్యదేవ్ కి.