Meera Mitun: షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఇండస్ట్రీలో ఉండకూడదు!

Meera Mitun: షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఇండస్ట్రీలో ఉండకూడదు!

Meera Mitun (1)

Meera Mitun: సినిమా పరిశ్రమ అంటే అదో రంగుల ప్రపంచం. అయితే.. ఆ రంగులకు తగ్గట్లే రోజుకో కొత్త వివాదాలు ఇక్కడ సహజం అన్నట్లుగా ఉంది పరిస్థితి. సినిమాలలో అంశాలలో దెబ్బతినే మనోభావాల నుండి క్యాస్టింగ్ కౌచ్ వరకు ఇక్కడ అన్నీ వివాదాలే. ఇక ఇప్పుడు కొత్తగా మరో వివాదానికి దారి తీసింది తమిళ నటి మీరా మిథున్. ఏకంగా షెడ్యూల్డ్ కులాల వారు ఎవరూ సినీ ఇండస్ట్రీలో ఉండకూడదని వివాదాస్పద కామెంట్లు చేసింది.

తమిళ బిగ్ బాస్ తో పాపులారిటీ దక్కించుకున్న మీరా మిథున్ ఇప్పుడు కోలీవుడ్ పాపులర్ నటి. అయితే.. ఏకంగా తమిళ ఇండస్ట్రీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు సినీ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందిన డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నిపుణులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని.. వారి కారణంగానే కోలీవుడ్ పరిశ్రమలో క్వాలిటి సినిమాలు రావడం లేదని కామెంట్ చేసింది. అంతేకాదు వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని వ్యాఖ్యానించింది.

మీరా మిథున్ వ్యాఖ్యలపై ఒక్క తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాలే కాదు.. అన్ని బాషల సినీ పరిశ్రమలో దుమారం రేగుతుంది. తమిళనాడులో ఇప్పటికే మీరా మిథున్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ సహా ఏడు జిల్లాలో మీరాపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు కాగా ఆమె మాట్లాడిన వీడియో ఆధారంగా తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.