పుష్పరాజ్ ఆరో వేలు సీక్రెట్ ఏందబ్బా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న‘పుష్ప’ చిత్రంలో కాలికి ఆరు వేళ్లతో కనిపించనున్నాడు..

  • Published By: sekhar ,Published On : April 8, 2020 / 11:43 AM IST
పుష్పరాజ్ ఆరో వేలు సీక్రెట్ ఏందబ్బా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న‘పుష్ప’ చిత్రంలో కాలికి ఆరు వేళ్లతో కనిపించనున్నాడు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్‌ టైటిల్, ఫస్ట్ లుక్ బన్నీ బర్త్‌డే సందర్భంగా.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ మాస్ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు.

విడుదల చేసిన రెండు పోస్టర్స్ ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టైటిల్, అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న పోస్టర్ చూస్తుంటే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. టైటిల్‌లో చేతి వేలి ముద్రలు కనిపిస్తుండగా.. కాలికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయి. బ‌న్నీ కాలికి ఆరో వేలు ఉండ‌టం వెనుక ఏదైనా ట్విస్ట్ ఉందా? అనే విష‌యం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Read Also : నటికి కరోనా అంటగట్టారు.. లబో దిబోమంటుంది..

PUSHPA

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా క‌థ తెర‌కెక్క‌నుంది. పోస్టర్లో బన్నీ పక్కన ఎర్రచందనం దుంగలు కనిపిస్తున్నాయి. లారీ డ్రైవర్ ‘పుష్ప’ అలియాస్ ‘పుష్ప రాజ్’ గా బన్నీ కనిపించనున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

A A 20