రజనీ లుక్ వెనుక రహస్యం తెలిసింది

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 08:39 PM IST
రజనీ లుక్ వెనుక రహస్యం తెలిసింది

తమిళ సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించిన సినిమా రోబో. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దక్షిణాధితోపాటు ఉత్తరాధిలోనూ సత్తా చాటింది. కాగా ఈ చిత్రం ఫొటో షూట్ లో తీసిన ఓ ఫొటోను సినిమాటోగ్రాఫర్ రిచార్డ్ ఎమ్ సతన్ ట్విటర్ లో షేర్ చేశారు. ఇంతవరకు ఈ లుక్ బయటికి రాలేదని తెలిపారు. 

‘2008లో రోబో సినిమా ఫొటో షూట్ లో నేను తీసిన స్టిల్ ఇది. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో తలైవా లుక్ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్ కోసం రజనీ కాంత్ కు సిల్వర్ రంగు పెయింట్ వేశారు. ఇప్పటివరకు విడుదల చేయని ఫొటో చూడండి’ అని ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రజనీ.. దర్బార్ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార హీరోయిన్ గా ఎఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయం అందుకుంది. దీని తర్వాత తలైవా అన్నాత్తేలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు.