Sekhar Master : బాలయ్య ఎండలో.. చిరంజీవి చలిలో.. వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్‌ఆఫ్..

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి పనిచేయడం, రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం నా అదృష్టం. వాల్తేరు వీరయ్యలో నువ్వే శ్రీదేవి అయితే నేనే చిరంజీవి సాంగ్, వీరసింహ రెడ్డిలో సుగుణ సుందరి పాటలకి కంపోజ్ చేశాను...............

Sekhar Master : బాలయ్య ఎండలో.. చిరంజీవి చలిలో.. వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్‌ఆఫ్..

Sekhar Master about chiranjeevi and balakrishna

Sekhar Master :  ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహ రెడ్డి సినిమాలతో రాబోతున్నారు. ఈ సినిమాలు రెండూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నుంచే రావడం విశేషం. ఇక ఈ రెండు సినిమాల్లో పలు పాటలకి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, బాలకృష్ణల గురించి ఆసక్తికర విషయాలని తెలిపారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి పనిచేయడం, రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం నా అదృష్టం. వాల్తేరు వీరయ్యలో నువ్వే శ్రీదేవి అయితే నేనే చిరంజీవి సాంగ్, వీరసింహ రెడ్డిలో సుగుణ సుందరి పాటలకి కంపోజ్ చేశాను. నేనే చిరంజీవి సాంగ్ ని -10 డిగ్రీస్ లో చేశాం. అలాంటి చలిలో ఎన్ని కోట్స్ వేసినా, రగ్గులు కప్పుకున్నా వణికిపోయేవాళ్ళం కానీ చిరంజీవి గారు అలంటి టైంలో కూడా ఎంతో డెడికేటెడ్ గా డ్యాన్స్ చేశారు. ఇక సుగుణ సుందరి సాంగ్ టర్కీలో ఫుల్ ఎండలో చేశాం. ఒకపక్క చెమటలు వస్తున్నా అంత ఎండ భరించి బాలకృష్ణ గారు డ్యాన్స్ చేశారు.

Trisha Krishnan : ‘అజిత్-విజయ్’లో నెంబర్ వన్ ఎవరన్నది తెలిపిన త్రిష..

ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఒక్కో దానికి రెండు, మూడు స్టెప్స్ అనుకోని వెళ్తాను. వాటిల్లో ఆ హీరోలకి ఏది కంఫర్ట్ అనుకుంటే వాటిని సెట్ చేస్తాను. ఇద్దరితో చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇద్దరూ కూడా చాలా డెడికేటెడ్ పర్సన్స్ అని తెలిపారు.