Kota Srinivasarao: టాలీవుడ్ హీరోల‌పై మండిప‌డ్డ కోటాశ్రీనివాస‌రావు.. ఆ వ్యాఖ్య‌లు పవన్ ను ఉద్దేశించేనా?

టాలీవుడ్‌ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై సీనియ‌ర్ న‌టుడు కోటా శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అల‌నాటి హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్‌ తీసుకునే వారో ఎవ్వ‌రికి చెప్పేవారు కాద‌ని ఇప్పుడు మాత్రం నేను రోజుకు రెండు కోట్లు, ఆరు కోట్లు తీసుకుంటున్నాను అంటూ హీరోలు ప‌బ్లిక్‌గా చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.

Kota Srinivasarao: టాలీవుడ్ హీరోల‌పై మండిప‌డ్డ కోటాశ్రీనివాస‌రావు.. ఆ వ్యాఖ్య‌లు పవన్ ను ఉద్దేశించేనా?

Kota Srinivasa Rao-Pawan Kalyan

Senior Actor Kota Srinivasarao: టాలీవుడ్‌ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై సీనియ‌ర్ న‌టుడు కోటా శ్రీనివాస‌రావు( Kota Srinivasarao) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అల‌నాటి హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్‌ తీసుకునే వారో ఎవ్వ‌రికి చెప్పేవారు కాద‌ని ఇప్పుడు మాత్రం నేను రోజుకు రెండు కోట్లు, ఆరు కోట్లు తీసుకుంటున్నాను అంటూ హీరోలు ప‌బ్లిక్‌గా చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ మండిప‌డ్డారు.

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియర్ న‌టులైన కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ వంటి వారిని ఘ‌నంగా స‌త్క‌రించారు. స‌న్మానం అనంత‌రం కోటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

Jabardasth Punch Prasad: జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం.. సాయం చేయాలంటూ ఇమ్మాన్యుయేల్ పోస్ట్‌

ఏం మాట్లాడారంటే..?

“ఈ రోజు సినిమా అనేది లేనే లేదు. అంతా ఓ స‌ర్క‌స్‌. విషాద గీతాల‌కు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు వంటి న‌టులు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఎప్పుడూ కూడా తాము తీసుకున్న పారితోషికాన్ని బాహాటంగా చెప్ప‌లేదు. అయితే.. ఇప్పుడున్న హీరోలు రోజుకి రూ.2కోట్లు, రూ.6 కోట్లు. 40 రోజుల‌కు రూ.80 కోట్లు అంటూ ప‌బ్లిక్‌గా నే చెబుతున్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. అప్ప‌ట్లో రామారావు, శ్రీదేవీతో క‌లిసి డ్యాన్స్ చేస్తుంటే వ‌య‌సు గురించి ఎవ‌రూ మాట్లాడేవారు కాదు. వాళ్లిద్ద‌రూ ఎంత చ‌క్క‌గా న‌టిస్తూ డ్యాన్స్ చేశార‌ని అనేవారు. తాను ఇప్పుడు డ్యాన్స్ చేసే ముస‌లోడు డ్యాన్స్ చేస్తున్నాడ‌ని అంటారు.” అంటూ కోటా శ్రీనివాస‌రావు త‌న‌పై తానే పంచ్ వేసుకుని అక్క‌డ ఉన్న‌వారిని న‌వ్వించారు.

ఎంత మంది ఆర్టిస్ట్‌లు రెండు పూట‌లా కడుపు నిండా అన్నం తింటున్నారు అనే విష‌యంపై దృష్టి సారించాల‌ని మా అసోసియేష‌న్‌కు కోటా శ్రీనివాస‌రావు సూచించారు. చిన్న ఆర్టిస్టులు బ‌త‌లేక‌పోతున్నార‌ని వాపోయారు. ఏదైన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాల‌ని వారు బావించిన‌ప్ప‌టికి బాత్రూమ్ క్లీన్ చేసే బ్ర‌ష్‌ల ద‌గ్గ‌ర నుంచి బంగారం ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కు అన్నింటిని కూడా స్టార్ హీరోలే చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. దీంతో చిన్న ఆర్టిస్టుల‌కు ప‌ని దొర‌క‌డం లేద‌న్నారు. ద‌య‌చేసి తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఒక్క‌టేన‌ని ‘మా’ స‌భ్యులు, ప్ర‌భుత్వాలు ఆలోచ‌న చేసి చిన్న ఆర్టిస్టుల‌ను బ‌తికించాల‌ని కోటా శ్రీనివాస‌రావు కోరారు.

Ramaprabha : శరత్ బాబు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రమాప్రభ.. వాళ్లందరికీ ఇండైరెక్ట్ గా కౌంటర్లు..

రెమ్యున‌రేష‌న్ పై చేసిన వ్యాఖ్య‌లు ఆ హీరోను ఉద్దేశించి చేసిన‌వేనా..?

ఓ సంద‌ర్భంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వేదిక పై త‌న పారితోషికం గురించి మాట్లాడారు. తన‌కి రోజుకి రెండు కోట్ల పారితోషికం ఇస్తున్నారని, 25 రోజులు కాల్షీట్లు ఇచ్చిన‌ట్లు తెలిపారు. కాగా.. ఈ విష‌యాన్నే కోటాశ్రీనివాస రావు ప‌రోక్షంగా ప్ర‌స్తావించడం ప‌ట్ల ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతుండ‌గా కొంద‌రు నెటీజ‌న్లు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. మ‌రీ కోటా చేసిన వ్యాఖ్య‌లు రానున్న రోజుల్లో ఏదైన వివాదానికి దారి తీస్తాయా..? లేదా అన్న‌ది చూడాల్సిందే.