Ashish Vidhyarthi : రోడ్డు పైన కాఫీ అమ్ముతున్న ఆశిష్ విద్యార్థి

మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తూ మధ్యలో ఆగి రోడ్ సైడ్ తింటూ ఉంటారు. రోడ్ సైడ్ ఉండే హోటల్స్ కి వెళ్తూ ఉంటారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా షూట్ కి వెళ్తూ రోడ్ సైడ్ టిఫిన్

Ashish Vidhyarthi : రోడ్డు పైన కాఫీ అమ్ముతున్న ఆశిష్ విద్యార్థి

Ashish

Ashish Vidhyarthi :  మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తూ మధ్యలో ఆగి రోడ్ సైడ్ తింటూ ఉంటారు. రోడ్ సైడ్ ఉండే హోటల్స్ కి వెళ్తూ ఉంటారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా షూట్ కి వెళ్తూ రోడ్ సైడ్ టిఫిన్ చేసి వెళ్ళాడు. ఈ వార్త బాగా వైరల్ అయింది. కొంతమంది సెలబ్రిటీలు తినడమే కాక సరదాగా కాసేపు అక్కడ కస్టమర్స్ కి అమ్ముతూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. సెలబ్రిటీలు వచ్చి ఆ షాప్ లో అమ్మడం ఆ షాప్ వాళ్లకి కూడా హెల్ప్ అవుతుంది. ప్రమోషన్ కూడా చేసుకుంటారు.

BiggBoss : ‘నిన్నే పెళ్లాడతా’లో ‘దాక్కో దాక్కో మేక’.. ఇది బిగ్ బాస్ వర్షన్..

తాజాగా ఓ సీనియర్ నటుడు ఇలాగే రోడ్ మీద కాఫీ తాగి ఆ షాప్ లో కాఫీ అమ్మి మరీ వెళ్లారు. తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్, కమెడియన్ క్యారెక్టర్స్ వేసే సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్ధి నిన్న షూటింగ్ నిమిత్తం గుంటూరు కి వెళ్లారు. షూటింగ్ కి వెళ్తూ దారిలో రోడ్ మీద కాఫీ తాగుదామని ఆగారు. ఆశిష్ విద్యార్థితో పాటు సీనియర్ నటి రోహిణి కూడా ఉన్నారు. ఆశిష్ కాఫీ తాగి ఆ తర్వాత తానే సొంతంగా కాఫీ ప్రిపేర్ చేసి కస్టమర్లకు అమ్మారు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆయన సింప్లిసిటీని చూసి అక్కడ ఉన్న ప్రజలతో పాటు నెటిజన్లు కూడా ఆయనని అభినందిస్తున్నారు.