Tollywood Drugs Case : డ్రగ్స్ సినీ ఫీల్డ్‌లోనే కాదు.. అన్ని చోట్లా ఉన్నాయి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు..

డ్రగ్స్ ఒక్క సినీ ఫీల్డ్‌లోనే కాదు అన్ని చోట్లా ఉన్నాయి.. వివిధ కారణాలతో ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ మాఫియాలూ ఉన్నాయి..

10TV Telugu News

Tollywood Drugs Case: తాను సినిమాల పరంగా బిజీగా ఉన్నానని అందువల్లే.. ‘మా’ సభ్యులకు అందుబాటులో ఉండలేక పోవడం, ఆ పోస్ట్‌కు సరైన న్యాయం చేయలేనన్న ఉద్దేశంతోనే ‘మా’ ఎన్నికల్లో పోటి చేయడం లేదన్నారు సీనియర్ నటుడు సుమన్..

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

ఆయన మాట్లాడుతూ.. ‘‘మా’ అధ్యక్ష పదవి, నటన.. ఇలా రెండు పడవల మీద కాలు పెట్టడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఎన్నికల్లో పోటీ చెయ్యడంలేదు. డ్రగ్స్ ఒక్క సినీ ఫీల్డ్‌లోనే కాదు అన్ని చోట్లా ఉన్నాయి.. వివిధ కారణాలతో ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ మాఫియాలూ ఉన్నాయి..

MAA Elections 2021 : బండ్ల గణేష్‌కు ప్రకాష్ రాజ్, జీవిత సెటైర్..

సినీ ఫీల్డ్‌కు సంబంధించినవి మాత్రమే ఎక్కువ పబ్లిసిటీ అవుతాయి.. సెలబ్రిటీలు, సినీ గ్లామర్‌పై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.. ఇతర దేశాల్లాగా మన దేశంలో కూడా కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే ఈ అసాంఘిక కార్యక్రమాలను అరికట్టగలం.. కఠినమైన శిక్షలు అమలు జరగనంత వరకు ఇవి ఇలానే కొనసాగుతూనే ఉంటాయి’’.. అన్నారు.

Drugs Case : డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హీరో రవితేజ