Asha Parekh : సీనియర్ నటి, నిర్మాత ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే.. ఆనందంలో బాలీవుడ్..

ఒకప్పటి బాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకురాలు ఆశా పారేఖ్‌కు 2020 సంవత్సరానికి సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కేని కేంద్ర ప్రభుత్వం..................

Asha Parekh : సీనియర్ నటి, నిర్మాత ఆశా పారేఖ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే.. ఆనందంలో బాలీవుడ్..

Senior Actress Asha Parekh gets Dada Saheb Phalke Award for the year of 2020

Asha Parekh :  ఒకప్పటి బాలీవుడ్ నటి, నిర్మాత, దర్శకురాలు ఆశా పారేఖ్‌కు 2020 సంవత్సరానికి సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కేని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకి తెలియజేశారు.

ఆశా పారేఖ్‌ (79)కు ఈ పురస్కారం 68వ జాతీయ పురస్కారాల ప్రదాన సభలో అందజేస్తారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటీలో ఆశా భోంస్లే, హేమమాలిని, పూనమ్‌ థిల్లాన్, ఉదిత్‌ నారాయణ్, టి.ఎస్‌. నాగాభరణ ఉన్నారు. 2019 సంవత్సరానికి రజనీకాంత్‌ ఈ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.

Krishnam Raju: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. 25 టన్నుల నాన్-వెజ్ వంటకాలు.. ఇంకా..

70, 80 దశకాల్లో చాలా మంది స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఆశా పారేఖ్. ఆ తర్వాత నటిగా సినిమాలకి దూరమైనా సినిమా రంగంలోనే డిస్ట్రిబ్యూటర్‌గా, సినిమా నటుల అసోసియేషన్‌కు నాయకురాలిగా, ప్రొడ్యూసర్‌గా సేవలు అందిస్తున్నారు. కేంద్ర సెన్సార్‌బోర్డుకు తొలి మహిళా చైర్మన్‌గా కూడా ఆశా పారేఖ్ తన సేవలు అందించారు. ఐదు దశాబ్దాలు సినిమా రంగంలో ఉన్నా ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా సినిమా రంగంలో సుదీర్ఘమైన సేవలు అందించడంతో నేడు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు దక్కింది. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.