SSMB28: మహేష్ సినిమాతో శోభన రీఎంట్రీ.. ఆమె పాత్ర ఏంటంటే?

మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్..

SSMB28: మహేష్ సినిమాతో శోభన రీఎంట్రీ.. ఆమె పాత్ర ఏంటంటే?

Ssmb28

SSMB28: మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ముహూర్తం కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుండగా ముందుగా మహేష్ పై సోలో సాంగ్ షూటింగ్ అలాగే మరో ఫైట్ ను తీస్తారట. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని టాక్.

Mahesh Babu : కళావతి స్టెప్పులతో మహేష్ ని దించేసిన సితార..

ఈ సినిమాలో మహేష్-పూజలతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనుంది. సహజంగానే త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్లకు రీ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ను మళ్ళీ తీసుకొచ్చిన త్రివిక్రమ్ హీరోలకు తల్లులుగా, అత్తలుగా, పిన్నీలాగా పాత్రలు సెట్ చేశాడు. కాగా.. ఇప్పుడు మహేష్ తో తీసే హ్యాట్రిక్ సినిమా కోసం కూడా మరో హీరోయిన్ ను తీసుకొస్తున్నాడు.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’లో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్.. ఈ హీరో తనయుడే..

సీనియర్ హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుందట. బయటకొచ్చిన సమాచారం ప్రకారం ఇందులో శోభనది మహేష్ కు పిన్ని పాత్ర కాగా సినిమాలో చాలా కీలకమైన పాత్రగా తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతున్న ఈ సినిమా మార్చి తొలి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుందట.