Senior Heros : ఫామ్ లోకి వచ్చిన సీనియర్ స్టార్ హీరోలు.. మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారా??

ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు మంచి దశ నడుస్తోంది. న్యూ జెనరేషన్ ఆడియన్స్ ను వీళ్ళను ఏ మేరకు రిసీవ్ చేసుకోగలరనే డౌట్స్ కు చెక్ పెడుతూ అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నారు............

Senior Heros : ఫామ్ లోకి వచ్చిన సీనియర్ స్టార్ హీరోలు.. మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారా??

Senior Heros coming into form with hits

Senior Heros : ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు మంచి దశ నడుస్తోంది. న్యూ జెనరేషన్ ఆడియన్స్ ను వీళ్ళను ఏ మేరకు రిసీవ్ చేసుకోగలరనే డౌట్స్ కు చెక్ పెడుతూ అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్ ఒక దశలో వరుస ఫ్లాప్స్ తో క్రైసిస్ లో పడింది. అలాంటి టైమ్ లో లోకేశ్ కనగరాజ్ ఆయన్ను ‘విక్రమ్’ గా నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో యాక్షన్ బాంబ్ లా ఎలివేట్ చేశాడు. కమల్ మెషీన్ గన్ తో చేసిన విన్యాసాలు, మాఫియా గ్యాంగ్ తో తలపడినప్పుడు బులెట్ల వర్షం కురిపిస్తూ సాగించిన రచ్చ థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్ లో పేలింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి కమల్ కి టూఇరిగి పూర్వ వైభవం ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా డ్రగ్ మాఫియాతో తలపడడం, మెషీన్ గన్స్ తో వారి భరతం పట్టడం ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొంత కాలంగా సరైన హిట్స్ లేని చిరు కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీగా నిలిచిపోయింది. సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. అదే సంక్రాంతికి వచ్చిన మరో సీనియర్ హీరో బాలకృష్ణ కూడా తనదైన రాయలసీమ యాక్షన్ మార్క్ తో హిట్ కొట్టి అఖండ తర్వాత వెంటనే మరో 100 కోట్ల సినిమా పట్టేసి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

తాజాగా బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ తో ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టాడు. నాలుగేళ్ళు గా హిట్స్ లేని షారుఖ్ కు ఈ మూవీ బ్లాక్ బస్టర్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

లేటెస్ట్ గా విక్టరీ వెంకటేశ్ సైతం ‘సైంధవ్’ అంటూ పెద్ద రైఫిల్ తో మాఫియా పని పట్టడానికి రంగంలోకి దిగాడు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దీనికి డైరెక్టర్. వెంకీ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రాబవుతుంది. ఇది వెంకటేష్ 75వ సినిమా కావడం విశేషం. వెంకీ మామ చాలా రోజుల తర్వాత యాక్షన్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు.

Pathaan : పఠాన్ వల్ల 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడ హౌస్ ఫుల్.. షారుఖ్ మేనియా..

దీంతో మిగిలిన స్టార్ హీరోలు కూడా ఫామ్ లోకి వచ్చేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు, జనరేషన్స్ మారినా తమ హీరోయిజానికి పదును పెట్టి మరోసారి రంగంలోకి దిగుతున్నారు స్టార్ హీరోలు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాతో యాక్షన్ తో రాబోతున్నారు. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేని రజినీకి ఈ సినిమా హిట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కూడా కిసీకా జాన్ కిసీకా భాయ్ అనే సినిమాతో హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి అవుట్ డేటెడ్ అవుతారన్న సీనియర్ స్టార్ హీరోలు ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ ఈ తరం హీరోలకి పోటీగా నిలుస్తున్నారు. ఫామ్ లోకి వచ్చిన కమల్, చిరంజీవి, షారుఖ్ ని చూసి మిగిలిన హీరోలు కూడా అదే బాటలో ఫాలో అయిపోయి హిట్స్ కొట్టడానికి రెడీ అంటున్నారు.