BA Raju : ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

BA Raju : ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

Ba Raju

Senior Journalist Producer BA Raju: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

నాలుగున్నర దశాబ్దాలుగా..జర్నలిస్టుగా పనిచేస్తూ..సూపర్ హిట్ వారపత్రిక నడుపుతున్నారు. ఆయన లేరని తెలుసుకున్న ప్రముఖులు, సినీ, ఇతర రంగాలకు చెందిన వారు సంతాపం తెలియచేస్తున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. బీఏ రాజు జీవిత విశేషాలకు వస్తే..జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు..దాదాపు.. 600 చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు.

2003లో ఆయన నిర్మాతగా మారి ఆయన భార్య బీ జయ దర్శకత్వంలో చంటిగాడు ఫిల్మ్ తీశారు. ఆ తర్వాత..గుండమ్మ గారి మనవడు, లవ్లీ, వైశాఖం చిత్రాలను నిర్మించారు. 2018లో బీఏ రాజు భార్య, దర్శకురాలు జయ చనిపోయారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం వైశాఖం. సూపర్ స్టార్ కృష్ణకు బీఏ రాజు వీరాభిమాని. ఆయన ప్రోద్బలంతోనే..రాజు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన మృతిపట్ల పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

Read More : అనస్థీషియా వైద్యుడు సుధాకర్‌ అకాల మరణం