సీనియర్స్ రీ ఎంట్రీ : ప్రభాస్ సినిమాలో భాగ్యశ్రీ, చిరు సినిమాలో జెనీలియా

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 04:17 AM IST
సీనియర్స్ రీ ఎంట్రీ : ప్రభాస్ సినిమాలో భాగ్యశ్రీ, చిరు సినిమాలో జెనీలియా

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో క్రేజీ హీరోయిన్స్ గా మెరిసి .. ఇప్పుడు పెళ్లి, పిల్లలు అంటూ ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేసి ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీదకు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగి చాలా కాలం గ్యాప్ తర్వాత పిల్లాపాపలను ఓ లైన్లో పెట్టి .. ఇప్పుడు మళ్లీ తీరిగ్గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఒకప్పటి సీనియర్ హీరోయిన్లు.. వాళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్ భాగ్యశ్రీ.

సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘ప్రేమ పావురాలు’ సినిమాలో క్యూట్ గా సింపుల్ గా కనిపించిన హీరోయిన్ భాగ్యశ్రీని ఎవ్వరూ మర్చిపోరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మెమరబుల్  మూవీస్ చేసిన భాగ్యశ్రీ.. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. భాగ్యశ్రీ కొడుకు కూడా హీరోగా లాంచ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఖాళీ టైమ్ చూసుకుని రీ ఎంట్రీ ఇస్తోంది భాగ్యశ్రీ. ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జాన్’ సినిమాలో మెయిన్ లీడ్ ప్లే చేస్తోంది భాగ్యశ్రీ. ఇప్పటికీ స్లిమ్ గా అంతే బ్యూటిఫుల్ గా ఉన్న భాగ్యశ్రీ తెలుగు తెరకు మరోసారి తళుక్కుమంటోంది ఈ అందాల తార. 

ప్రభాస్ సినిమాతో భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇస్తుంటే .. చిరంజీవి సినిమాతో జెనీలియా కమ్ బ్యాక్ అవుతోంది. మెగాస్టార్ సుజిత్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ కోసం  జెనీలియా మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో ‘బొమ్మరిల్లు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన జెన్నీ.. రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తోంది. అయితే ..‘లూసిఫర్’ సినిమాలో  మెయిన్ రోల్ కోసం జెనీలియాని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించాలని ట్రై చేస్తున్నాడట సుజిత్. 

ఈ ఇద్దరితో పాటు .. డ్యాన్సింగ్ సెన్సేషన్ సిమ్రన్ కూడా .. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మద్యనే రజనీకాంత్ ‘పేట’ సినిమాలో కామియో రోల్ చేసి సర్ ప్రైజ్ చేసిన సిమ్రన్.. రాజ్ తరుణ్ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.  సిమ్రన్ తెలుగులోనే కాదు సౌత్ లో..అందరి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇలా ఈ సీనియర్ హీరోయిన్లు మళ్లొకసారి టాలీవుడ్ స్క్రీన్ మీద మెరవబోతున్నారు. (నవాజుద్దీన్ కుటుంబం చిత్ర హింసలు పెట్టింది – అలియా)