Radha Prashanthi : కాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ ఇప్పటి వాళ్ళ లాగా పబ్లిసిటీ చేయలేదు.. సీనియర్ నటి వ్యాఖ్యలు..

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతూనే ఉంటుంది అని ఇప్పటికే చాలా మంది తెలిపారు. సినిమాల కోసం, అవకాశాల కోసం తాము కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నాం అని............

Radha Prashanthi : కాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ ఇప్పటి వాళ్ళ లాగా పబ్లిసిటీ చేయలేదు.. సీనియర్ నటి వ్యాఖ్యలు..

Radha

Radha Prashanthi :  సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతూనే ఉంటుంది అని ఇప్పటికే చాలా మంది తెలిపారు. సినిమాల కోసం, అవకాశాల కోసం తాము కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నాం అని పలువురు హీరోయిన్స్ బహిరంగంగానే చెప్పారు. ఇది అన్ని చోట్ల ఉన్నా సినీ పరిశ్రమలో జరిగేదే బయటకి ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా సీనియర్ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసింది.

Mahesh Babu : స్టేజి మీద మ మ మహేష్ మాస్ డ్యాన్స్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అభిమానుల కోసం..

 

నటిగా పలు సినిమాల్లో నటించి, ఇప్పుడు సేవా కార్యక్రమాలు, సమాజం కోసం పోరాడుతూ సామాజిక కార్యకర్తగా నివసిస్తున్న రాధా ప్రశాంతి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. రాధా ప్రశాంతి మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. అప్పట్లో ఇలాంటివి ఎదురైనా పట్టించుకోకుండా వెళ్ళేవాళ్ళు, ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు అంతే తేడా. ఇక్కడ ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. సినిమా కావాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాలి అని కొంతమంది అడుగుతారు, ఇక అది మన ఇష్టం. నాకు కూడా ఇలాంటి పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. నన్ను సినిమాల్లో తీసుకొని తర్వాత తప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక్కుంటే నా స్థానంలో కమిట్‌మెంట్‌ ఇచ్చిన వాళ్లని పెట్టుకున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కాస్టింగ్‌ కౌచ్‌ ఉంటుంది” అని తెలిపారు.