Nagarjuna : ‘బంగార్రాజు’కి కూడా సీక్వెల్ ఉండొచ్చు

నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ''సీనియర్‌ బంగార్రాజు అనేది ఆత్మ కాబట్టి ఎక్కడికైనా రావొచ్చు. కథలో సీక్వెల్స్‌కు సరిపోయే ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి......

Nagarjuna : ‘బంగార్రాజు’కి కూడా సీక్వెల్ ఉండొచ్చు

Bangarraju

Bangarraju :  నాగార్జున డ్యూయల్ రోల్ లో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా భారీ విజయం సాధించడంతో అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘బంగార్రాజు’గా సీక్వెల్ సినిమా తీశారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా రిలీజ్ అయినప్పుడే దానికి సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయినట్టు నాగార్జున ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. నాగార్జున, నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ జనవరి 14న రిలీజ్ అయింది. నిన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సినిమా టీం.

Radheshyam : సంక్రాంతికి సినిమా లేదు.. గాలి పటాలు మాత్రమే..

‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూలలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”సీనియర్‌ బంగార్రాజు అనేది ఆత్మ కాబట్టి ఎక్కడికైనా రావొచ్చు. కథలో సీక్వెల్స్‌కు సరిపోయే ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకి వచ్చిన స్పందన చూసి ‘బంగార్రాజు’ సీక్వెల్ ప్లాన్ చేశాము. ఇప్పుడు ‘బంగార్రాజు’కి కూడా విడుదలకి ముందే మంచి పేరు వస్తుంది. ‘బంగార్రాజు’ విడుదలైన తర్వాత దీని సీక్వెల్‌ గురించి ఆలోచిస్తాం. అన్నీ కుదిరితే కచ్చితంగా ‘బంగార్రాజు’కి కూడా సీక్వెల్ తీస్తాము” అని తెలిపారు.