Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

తాజాగా '24' సినిమాకి సీక్వెల్ సన్నాహాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' లాంటి సినిమాలతో ఓటీటీలో మంచి విజయాలు సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

Suriya (1)

Suriya :  సూర్య, సమంత హీరో హీరోయిన్స్ గా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో 2016లో టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమా ’24’. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లోనూ సూర్య మెప్పించారు. తమిళ్, తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇండియాలో వచ్చిన సినిమాలలో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విజయానంతరం అప్పుడే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాకి భవిష్యత్తులో సీక్వెల్ తీసే ప్లాన్ ఉందని చెప్పారు.

Navadeep : గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు.. పెళ్ళికి నో అంటున్న నవదీప్

తాజాగా ’24’ సినిమాకి సీక్వెల్ సన్నాహాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ లాంటి సినిమాలతో ఓటీటీలో మంచి విజయాలు సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఫామ్ ని ఇలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. సూర్య నటిస్తున్న ‘ఈటి’ సినిమా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. డైరెక్టర్ విక్రమ్ ఇప్పటికే ’24’ సీక్వెల్ కి కథ రెడీ చేసినట్టు సమాచారం. సూర్యకి ఒకసారి చెప్పి ఓకే చేసేస్తే త్వరలోనే ’24’ సినిమాకి సీక్వెల్ ప్రకటన రానుంది. మరోసారి డైరెక్టర్ విక్రమ్, సూర్య కలిసి అద్భుతం సృష్టించడం ఖాయం.