Uppena 2: ఉప్పెనకి సీక్వెల్.. పాన్ వరల్డ్ కథంటున్న బుచ్చిబాబు

టాలీవుడ్ లో ఉప్పెన సినిమా తెచ్చిన వైబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన‌..

Uppena 2: ఉప్పెనకి సీక్వెల్.. పాన్ వరల్డ్ కథంటున్న బుచ్చిబాబు

Uppena 2

Uppena 2: టాలీవుడ్ లో ఉప్పెన సినిమా తెచ్చిన వైబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన‌.. పేరుకు తగ్గట్లే వసూళ్లను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకు వ‌చ్చిన బుచ్చిబాబు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరో లేదా దర్శకుడి మొదటి సినిమాకు వంద కోట్ల వసూళ్లు వచ్చిన దాఖలాలు లేకపోగా.. అది చేసి చూపించాడు బుచ్చిబాబు.

Rashmika: రష్మికకి కోపమొస్తే ఇలా చూపిస్తుందా..? వీడియో వైరల్!

ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ఎలాంటి సినిమా చేయనున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా అనూహ్యంగా ఒకరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌నున్నానని తానే స్వయంగా ప్రకటించాడు. ఈ సినిమా ఏమైందో కానీ.. ఉప్పెన 2 కథ కూడా సిద్ధంగా ఉందంటున్నారు బుచ్చిబాబు. ఒకవిధంగా ఉప్పెన కథ రాసే కంటే ముందే సీక్వెల్ కథను కూడా రాసుకున్నట్లు వివరణ ఇచ్చిన బుచ్చి ఇది పాన్ ఇండియా సినిమాగా కాకుండా అంతకు మించి అనేలా పాన్ వరల్డ్ సినిమాగా ఉంటుందని చెప్పాడు.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

దీంతో సినిమా కథ ఎలా ఉంటుందో అని ఓ వర్గం ప్రేక్షకుల్లో మళ్లీ అంచనాలు పెరిగాయి. కాగా, ఎన్టీఆర్ తో సినిమా విషయానికి వస్తే.. బుచ్చిబాబు చెప్పిన కథకు ఎన్టీఆర్ ఒకే చెప్పినా పూర్తిస్థాయిలో కథకు ఇంకా గ్రీన్ సిగ్నల్ పడలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కథ పనిలోనే బుచ్చి ఉండగా ఎన్టీఆర్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఇది ఎంతవరకు పట్టాలెక్కనుందని అనుమానాలొస్తున్నాయి. ఇక ఇప్పుడు ఉప్పెన 2కి బుచ్చిబాబు చెప్పే రేంజ్ లో అంటే ఈ సీక్వెల్ కు హీరోను ఎవరిని తీసుకుంటారన్నది కూడా ఆసక్తిగా మారింది.