నేను చచ్చిపోయినా వచ్చేవాళ్లు కాదు.. శివపార్వతి ఎమోషనల్ వీడియో..

  • Published By: sekhar ,Published On : August 19, 2020 / 01:02 PM IST
నేను చచ్చిపోయినా వచ్చేవాళ్లు కాదు.. శివపార్వతి ఎమోషనల్ వీడియో..

కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి శివపార్వతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కొద్దికాలంగా ఆమె సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘వ‌దినమ్మ’ సీరియ‌ల్‌లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న శివ‌పార్వ‌తి కరోనా వైర‌స్ కార‌ణంగా హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప‌రిస్థితి క్రిటికల్ అయ్యింది. చివ‌ర‌కు డాక్ట‌ర్స్ స‌హాయంతో ఆమె బ్ర‌తికారు. త‌నకు క‌రోనా వైర‌స్ సోకడం, తాను ఎదుర్కొన్న మాన‌సిక ప‌రిస్థితి ఇబ్బందులు గురించి శివ పార్వ‌తి ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
Shiva Parvathi ‘‘నాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చి.. మ‌ళ్లీ ఇంటికి వ‌స్తానో లేదో అనే ప‌రిస్థితిలోకి వెళ్లిపోయి, ప‌దిరోజుల త‌ర్వాత నిన్న‌రాత్రే ఇంటికి చేరుకున్నాను. రెండు హాస్పిట‌ల్స్ మారాను. ఈ విష‌యం ప్ర‌భాక‌ర్‌గారికి, యూనిట్ స‌భ్యుల‌కు కూడా తెలుసు. ఈ విష‌యంలో నేను ఎవ‌రికీ ఏమీ అన‌ద‌లుచుకోలేదు.

ఎంత పెద్ద ఆర్టిస్ట్‌, చిన్న ఆర్టిస్ట్ అయినా ఆప‌ద ఒక‌టే, ప్రాణం ఒక‌టే. ఆర్టిస్టులుగా మ‌నం క‌లిసి ప‌నిచేస్తున్న‌ప్పుడు అనుబంధం ఉండాలి. కానీ.. నా గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇది దుర‌దృష్టం. ఎవ‌రి స‌మ‌స్య వారిది. ఎవ‌రికీ ఎవ‌రూ తోడుండ‌రు. ప్ర‌భాక‌ర్‌గారి నుండి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయ‌కూడ‌దు. మ‌నుషుల మ‌ధ్య సంబంధాలు కృత‌కంగా అయిపోయాయి. నేను ఐదేళ్ల నుండి సినిమాలు చేయ‌క‌పోయినా జీవిత రాజ‌శేఖ‌ర్‌గారు హాస్పిట‌ల్‌కు వ‌చ్చారు. నా పరిస్థితి తెలుసుకుని అక్క‌డ డాక్ట‌ర్స్‌తో మాట్లాడారు. చాలా విష‌యాల్లో స‌పోర్ట్ చేసి న‌న్ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు.Shiva Parvathi రెండు ల‌క్ష‌లు ఏం స‌రిపోతుందండి.. ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల ఇన్సూరెన్స్ చేసుకోమ‌ని ప్ర‌భాక‌ర్‌గారు చెప్పారు. నేను చేసుకోలేక‌పోయాను. ప్రొడ‌క్ష‌న్ నుండి ఇన్సూరెన్స్ ఏదో చేశామ‌ని అన్నారు. కానీ అదేమైనా నాకు ప‌నికొస్తుందా? క‌్లెయిమ్ చేసుకోండి అని ఎవ‌రూ చెప్ప‌లేదు. ఈ విష‌యంలో నేను అంద‌రికీ థ్యాంక్స్ చెప్పాల‌నుకుంటున్నాను.Shiva Parvathi నేను పోయాన‌ని తెలిసినా రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది. ఈ సీరియ‌ల్‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శివ‌కుమార్‌గారు ఖ‌మ్మంలో మాకు స‌న్మానం చేశారు. ఆ అభిమానంలో కనీసం అవ‌గింజంత కూడా ఆర్టిస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ప్పుడు లేదు. అభిమానాన్ని పాటించిన రోజే ఆర్టిస్ట్ అనేవాడికి అర్హ‌త ఉంటుంది. అంతే కానీ.. మేక‌ప్ వేసుకుని న‌టించేస్తే క‌రెక్ట్ కాదు’’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివపార్వతి.