Shaakuntalam: శాకుంతలం 3D ట్రైలర్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో మైథ‌లాజిక‌ల్ డ్రామాగా తెరకెక్కిన ‘శాకుంతలం’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా 3D ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Shaakuntalam: శాకుంతలం 3D ట్రైలర్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Shaakuntalam 3D Trailer Release On March 28

Shaakuntalam: టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ మైథలాజికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిస్తుండగా, సమంత శకుంతల పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Shaakuntalam : శాకుంతలం కోసం.. ఏకంగా అన్ని కోట్లు పెట్టి రియల్ నగలా??.. ఒక్క సమంతకే 15 కిలోల బంగారం..

అయితే, ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. కాగా, ఈ సినిమాను 3Dలోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో, ఇప్పుడు ఈ సినిమా 3D ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈ 3D ట్రైలర్‌ను మార్చి 28న సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రసాద్స్‌ ఐమాక్స్‌ స్క్రీన్‌ -6లో ఈ లాంఛింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Shaakuntalam: దుర్వాసుడిగా కలెక్షన్ కింగ్ లుక్ అదుర్స్..!

శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో మైథ‌లాజిక‌ల్ డ్రామాగా శాకుంతలం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌, మోహన్ బాబు, అల్లు అర్హా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.