Tollywood : తమిళ సినిమా గురించి వెనక్కి తగ్గుతున్న తెలుగు సినిమాలు..

ఈ ఫిబ్రవరిలో సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. దాదాపు 9 సినిమాలు బాక్స్ ఆఫీస్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఒకే డేట్ లో రెండు, మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సమంత కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'శాకుంతలం', విశ్వక్ సేన్ 'ధమ్కీ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యం విష్ణు కథ', తమిళ హీరో ధనుష్ 'సార్' సినిమాలు ఒకే రోజున విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు ధనుష్ సినిమా కోసం మిగిలిన మూడు తెలుగు సినిమాలు వెనక్కి తగ్గుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tollywood : తమిళ సినిమా గురించి వెనక్కి తగ్గుతున్న తెలుగు సినిమాలు..

dhamki shakunthalam

Tollywood : ఈ ఫిబ్రవరిలో సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. దాదాపు 9 సినిమాలు బాక్స్ ఆఫీస్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఒకే డేట్ లో రెండు, మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సమంత కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘శాకుంతలం’, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యం విష్ణు కథ’, తమిళ హీరో ధనుష్ ‘సార్’ సినిమాలు ఒకే రోజున విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు ధనుష్ సినిమా కోసం మిగిలిన మూడు తెలుగు సినిమాలు వెనక్కి తగ్గుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Shaakuntalam : 3 కోట్ల నగలతో, 30 కేజీల బరువుతో సమంత శాకుంతలం షూటింగ్..

ధనుష్ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు తెలుగు వాడైనా ఈ మూవీ తమిళ సినిమా గానే వస్తుంది. మరి అలాంటప్పుడు ఆ మూవీ కోసం తెలుగు సినిమాలు సైడ్ ఇవ్వడం ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిజల్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఒకే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే ఓపెనింగ్స్ రావడం కష్టమని భావిస్తున్నారు మేకర్స్.

అసలే శాకుంతలం సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నాడు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల విషయంలో రిస్క్ తీసుకునే ఆలోచనలో లేడు గుణశేఖర్. అందుకనే శాకుంతలం చిత్రం విడుదలను పోస్ట్‌పోన్ చేయడానికి సిద్దమయ్యినట్లు సమాచారం. అలాగే విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం కెరీర్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గా వస్తున్న ధమ్కీ, వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల విషయంలో కూడా రిస్క్ తీసుకునే ఆలోచన చేయడం లేదట ఇద్దరు హీరోలు. అందుకనే వారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల పై చిత్రం యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.