Shaakuntalam: సమంతను చూసి సైడవుతున్న హీరోలు!

స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Shaakuntalam: సమంతను చూసి సైడవుతున్న హీరోలు!

Shaakunthalam Effect On Small Heroes Movies

Shaakuntalam: స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Shaakuntalam : ప్రమోషన్స్ మొదలు పెట్టిన ‘శాకుంతలం’ టీం.. మొదటి సాంగ్‌కి డేట్ ఫిక్స్!

కాగా, ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది. దీంతో శాకుంతలం ఎఫెక్ట్ ఇప్పుడు పలు సినిమాలపై పడింది. ముందుగానే ఫిబ్రవరిలో రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకోవాలని పలువురు హీరోలు రెడీ అయ్యారు. విశ్వక్ సేన్ ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ధనుష్ ‘సార్’ చిత్రాలు ఫిబ్రవరి 17నే రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నాయి. కానీ, సడెన్‌గా సమంత ‘శాకుంతలం’ రంగంలోకి దిగడంతో, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ను మార్చుకుంటున్నారు.

Shaakuntalam : విజువల్ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్.. గుణశేఖర్ మార్క్ మూవీ!

అయితే ధనుష్ ‘సార్’ మాత్రం శాకుంతలంతో పోటీకి దిగుతుంది. ఇక విశ్వక్, కిరణ్ అబ్బవరంలు తమ సినిమాలను మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా, మార్చిలో తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మాత్రం ఆయా హీరోలు క్లారిటీ ఇవ్వలేదు. మరి సమంతను చూసి సైడవుతున్న ఈ హీరోలు, తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.