Shaakuntalam : ‘శాకుంతలం’కి తన సంగీతంతో ప్రాణం పోస్తున్న మణిశర్మ.. ఏలేలో ఏలేలో!

సమంత నటిస్తున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. ఇక మూవీ నుంచి ఒకొక పాటని రిలీజ్ చేస్తూ వస్తున్న మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. 'ఏలేలో ఏలేలో' అంటూ సాగే పాట..

Shaakuntalam : ‘శాకుంతలం’కి తన సంగీతంతో ప్రాణం పోస్తున్న మణిశర్మ.. ఏలేలో ఏలేలో!

Shaakuntalam third single Yelelo Yelelo

Shaakuntalam : సమంత నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ‘శాకుంతలం’. హిందూ ఇతిహాసాలు ఆధారంగా వస్తున్న ఈ మూవీని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. దేవకన్య అయిన మేనకకి పుట్టిన ‘శకుంతల’ పాత్రలో సమంత కనిపించబోతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీ పై మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో అనే ఒక క్లారిటీ ఇచ్చాడు గుణశేఖర్.

Shaakuntalam: శాకుంతలం రిలీజ్ మళ్లీ డౌటేనా.. ఆ హీరో సినిమానే కారణమా..?

ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. ఇక మూవీ నుంచి ఒకొక పాటని రిలీజ్ చేస్తూ వస్తున్న మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘ఏలేలో ఏలేలో’ అంటూ సాగే పాట ఒకప్పటి మణిశర్మని గుర్తుకు చేస్తుంది. ఈ మెలోడీకి చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి పాడాడు. లిరిక్స్, వాయిస్, మెలోడీతో పాట నాన్ మ్యూజిక్ లవర్స్ మనసుని సైతం హత్తుకునేలా ఉంది.

కాగా ఈ మూవీ నుంచి ‘మల్లికా మల్లికా’, ‘రుషివనంలోన’ సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మణిశర్మ తన పాటలతో, ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో శాకుంతలంకు ప్రాణం పోస్తున్నాడు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తాము అంటూ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ చిత్రం పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.