Shaakuntalam: అల్లు అర్హపై స్పెషల్ అప్డేట్ ఇచ్చిన శాకుంతలం టీమ్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, అందాల భామ సమంత ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘మల్లికా మల్లికా’ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్.

Shaakuntalam: అల్లు అర్హపై స్పెషల్ అప్డేట్ ఇచ్చిన శాకుంతలం టీమ్!

Shaakuntalam Update On Allu Arha Dubbing

Shaakuntalam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, అందాల భామ సమంత ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘మల్లికా మల్లికా’ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్.

Allu Arha : డబ్బింగ్ చెప్తున్న అర్హ.. మురిసిపోయిన అల్లు అర్జున్..

ఇక ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ భరత కుమారుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ చివర్లో అల్లు అర్హ ఎంట్రీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాతో అల్లు అర్హ మంచి గుర్తింపును తెచ్చుకోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా అల్లు అర్హకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది శాకుంతలం చిత్ర యూనిట్. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు చాలా ఈజీగా ముగించేసిందట అల్లు అర్హ.

Shaakuntalam : ప్రమోషన్స్ మొదలు పెట్టిన ‘శాకుంతలం’ టీం.. మొదటి సాంగ్‌కి డేట్ ఫిక్స్!

ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో అల్లు అర్హ తన పాత్రకు డబ్బింగ్ చెబుతూ సందడి చేస్తూ కనిపించింది. భరత కుమారుడి పాత్రలో అల్లు అర్హ నటన ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సమంతతో పాటు దేవ్ మోహన్, అదితి బాలన్, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధూ, అనన్య నాగళ్ల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా, ఫిబ్రవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.