Mithaliraj : శభాష్ మిథు ట్రైలర్ రిలీజ్.. మిథాలీరాజ్ గా మెప్పించిన తాప్సి..

భారత క్రికెట్ లో మహిళా క్రికెట్ కి వన్నె తెచ్చి, భారత మహిళా క్రికెట్ టీంని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా 'శభాష్ మిథు' సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మిథాలీరాజ్ పాత్రని......

Mithaliraj : శభాష్ మిథు ట్రైలర్ రిలీజ్.. మిథాలీరాజ్ గా మెప్పించిన తాప్సి..

Mithaliraj

Shabaash Mithu :  గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బయోపిక్స్ వస్తూనే ఉన్నాయి. అవి హిట్ అయినా, ఫట్ అయినా బాలీవుడ్ వాళ్ళు బయోపిక్ లు తీయడం మాత్రం మానరు. స్పోర్ట్స్, సినిమాలు, పాలిటిక్స్.. ఇలా పలు రంగాల్లో సక్సెస్ సాధించిన జీవితాలని ఆధారంగా బయోపిక్ లని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ లో ‘అజారుద్దున్’, ‘ఎంఎస్ ధోని’, ‘సచిన్’, కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘83’ బయోపిక్ లు తెరకెక్కాయి. తాజాగా మరో బయోపిక్ రానుంది.

భారత క్రికెట్ లో మహిళా క్రికెట్ కి వన్నె తెచ్చి, భారత మహిళా క్రికెట్ టీంని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా ‘శభాష్ మిథు’ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మిథాలీరాజ్ పాత్రని తాప్సి పోషిస్తుంది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ ఇటీవలే 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో ఆమె బయోపిక్ రానుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్న శభాష్ మిథు సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.

 

Prabhas : ప్రాజెక్ట్ K సెట్‌లో RRR…

ఈ ట్రైలర్‌లో మిథాలీ రాజ్ ఎలా క్రికెటర్ గా ఎదిగింది? లేడీ క్రికెటర్‌గా ఎదర్కొన్న అవమానాలు, టీంతో కలవడం, తన ఆటని, ఇండియన్ మహిళా క్రికెట్ సమస్యల్ని నిలదీయడం, తన కెప్టెన్సీతో ఇండియన్ మహిళా టీంని ఎలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిందో చూపించారు. కథ ఎలా ఉండబోతుంది అని ట్రైలర్ లో చూపించారు. ఇక చివరగా.. గతంలో మిథాలీ రాజ్ ని మీడియా వాళ్ళు మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగితే మిథాలీ ఇదే ప్రశ్నమేల్ క్రికెటర్లని ఫేవరేట్ ఫీమేల్ క్రికెటర్ అని అడగగలరా అని సమాధానమిచ్చింది. ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ సీన్ ని ట్రైలర్ లాస్ట్ లో పెట్టి మరింత ఆసక్తికరంగా మలిచారు.

ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మిథాలీ కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించడంతో సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రికెట్ బయోపిక్స్ లో ఒక్క ధోని జీవితంపై తెరకెక్కిన ‘MS ధోని’… ది అన్‌టోల్డ్ స్టోరీ’ తప్ప మిగిలినవేవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. మరి మిథాలీ రాజ్ జీవితంపై తెరకెక్కిన ‘శభాష్ మిథు’ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాని వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది. జులై 15న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది శభాష్ మిథు.