Jawan : జవాన్‌ని పోస్ట్‌పోన్ చేయబోతున్న షారుఖ్.. కారణం అదేనా?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ దాదాపు 6 ఏళ్ళ తరువాత హిట్టు చూశాడు. పఠాన్ సినిమాతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు..

Jawan : జవాన్‌ని పోస్ట్‌పోన్ చేయబోతున్న షారుఖ్.. కారణం అదేనా?

shah rukh khan Jawan will be postponed?

Jawan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ దాదాపు 6 ఏళ్ళ తరువాత హిట్టు చూశాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా తరువాత అరడజనకు పైగా సినిమాల్లో నటించిన ఒక్కటి హిట్ కాలేకపోయింది. ఇక రీసెంట్ గా పఠాన్ సినిమాతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్ ఏ సినిమా ఎదురుకొని వెతిరేకతతో ఆడియన్స్ ముందుకు వచ్చి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రియల్ బాద్‌షా అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ని అలానే మెయిన్‌టైన్ చేసేలా షారుఖ్ జాగ్రత్త పడుతున్నాడు.

Shah Rukh Khan : ఇది బిజినెస్ కాదు, పర్సనల్.. పఠాన్ పై షారుఖ్ ఎమోషనల్ ట్వీట్!

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఇది బాలీవుడ్ సినిమా అయినప్పటికీ మొత్తం సౌత్ యాక్టర్స్ నిండిపోయింది. హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రియమణి, మన్సూర్ అలీఖాన్, యోగిబాబు సౌత్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగం అవుతుండగా తమిళ స్టార్ హీరో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Shah Rukh Khan : నాకంటే సల్మాన్ ఖాన్ గొప్ప.. షారుఖ్ ఖాన్ ట్వీట్!

కాగా ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ కి పోస్ట్‌పోన్ చేయబోతున్నారు అని సమాచారం. షూటింగ్ ఇంకా పెండి ఉందట. ఇక పఠాన్ హిట్టుతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తలు తీసుకోని చేయాలనీ షారుఖ్ బావిస్తున్నాడట. అంత ఒకే అనుకున్న తరువాతే మూవీ ఆడియన్స్ ముందుకు తీసుకువెళ్లాలి అని షారుఖ్ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తుంది. మరి ఈ పోస్ట్‌పోన్ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు.