క్రికెటర్‌గా షారూఖ్.. గుర్తుపట్టలేనంతగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో

క్రికెటర్‌గా షారూఖ్.. గుర్తుపట్టలేనంతగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో

షారూఖ్ ఖాన్ (SRK) ప్లాష్‌బ్యాక్‌లో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. టీనేజ్ లో క్రికెట్ ఆడుతున్న ఫొటో అది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో Shah Rukh Khanఎవరూ గుర్తు పట్టలేనంతగా ఉన్నాడు. దానిని ఎకనామిక్ టైమ్స్ షేర్ చేసింది. ”షారూఖ్ ఖాన్‌ను గుర్తు పట్టలేనట్లుగా ఉంది ఈ ఇమేజ్” అని అందులో రాసుకొచ్చాడు.

ఆ పిక్చర్ లో నూనూగు మీసాలు, పూర్తిగా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఎస్సారెక్కే చాలా తక్కువసార్లు మాత్రమే మీసంతో కనిపించాడు.



షారూఖ్ ఖాన్ తనకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని చాలా ఇంటర్వ్యూల్లో బయటపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)ను సొంతం చేసుకున్నాడు. ఈ లెజండరీ యాక్టర్ సాకర్, క్రికెట్ ప్లేయర్.

అతని వెన్నెముకకు గాయం అయిన తర్వాత కేవలం స్పోర్ట్స్ జోలికి వెళ్లకుండా పూర్తిగా యాక్టింగ్ మీదనే ఫోకస్ పెట్టినట్లు 2008లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐపీఎల్ జట్టు కొనుగోలు చేసిన షారూఖ్.. దేవుడు నాకు డబ్బు, హోదా ఇచ్చాడు. నేను స్పోర్ట్స్ లో దీనిని ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదట అతనికి స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయాలనే కోరిక కూడా ఉందని కోరికను బయటపెట్టాడు.

 

View this post on Instagram

 

Throwback! @iamsrk looks almost unrecognizable in this picture! . . #shahrukhkhan #throwbacksunday #shahrukkhan #iamsrk #srkfanclub #shahrukhkhanfans #bollywoodflashback #bollywoodactor #actorslife #etimes

A post shared by ETimes (@etimes) on

షారూఖ్.. ఇటీవల దుబాయ్ లో భార్య గౌరీతో కనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రోజున. జుట్టు పెంచుకుని ఉన్న షారూఖ్.. కేకేఆర్ లోగోతో మాస్క్ ధరించి ప్లేయర్లతో పాటు ఉన్నాడు.

ఈ సారి కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఐపీఎల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా లక్ష మంది ప్రాణాలను బలిగొంది. దీని కారణంగా మొత్తం 66లక్షల మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.