విజ‌య్ సినిమాలో బాలీవుడ్ న‌టుడు

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 05:55 AM IST
విజ‌య్ సినిమాలో బాలీవుడ్ న‌టుడు

దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘థలపతి 63’. ప్ర‌స్తుతం ఈ సినిమా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్  చెన్నైలో జ‌రుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో AGS ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, ఇందులో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల టీం ప్ర‌క‌టించింది.
 
దీపావ‌ళికి విడుద‌ల కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ అతిధి పాత్ర చేయ‌బోతున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. ఒక‌వేళ ఈ వార్త నిజ‌మైతే ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ రావ‌డం ఖాయం అంటున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  ఇందులో విజ‌య్ పాత్ర పేరు మైఖేల్ అని తెలుస్తుంది. AR రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.