Pathaan : ఎట్టకేలకు 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన పఠాన్..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బాలీవుడ్ ని తన సినిమాతో ఆదుకున్నాడు. కొన్నాళ్లుగా తమ సినిమాలు అన్ని బి-టౌన్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తుంటే, సౌత్ సినిమాలు ఆ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్...

Pathaan : ఎట్టకేలకు 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన పఠాన్..

Pathaan

Pathaan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ బాలీవుడ్ ని తన సినిమాతో ఆదుకున్నాడు. కొన్నాళ్లుగా తమ సినిమాలు అన్ని బి-టౌన్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తుంటే, సౌత్ సినిమాలు ఆ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని, ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని చేసిన చిత్రం ‘పఠాన్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ గా కనిపించాడు.

Pathaan Offer : 1000 కోట్ల కోసం పఠాన్ మరో ఆఫర్.. మొన్న ఒక్క రోజే.. ఇప్పుడు వీక్ డేస్ అంతా..

దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు చాలా వ్యతిరేకతను ఎదురుకోవడంతో.. పెట్టిన బడ్జెట్ ని అయినా రాబట్ట గలదా? అని అందరు అనుమాన పడ్డారు. కానీ మూవీ రిలీజ్ తరువాత అంతా మారి పోయింది. రోజుకో కోటి చొప్పున 6 రోజుల్లో 600 కోట్లు రాబట్టింది. ఇక అక్కడి నుంచి 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి మాత్రం చాలా కష్ట పడింది. 1000 కోట్ల మార్క్ అందుకొని, బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకు రావడానికి.. కొన్ని రోజులు వరకు మరో పెద్ద మూవీ రిలీజ్ కాకుండా చూసుకున్నారు.

అంతేకాదు టికెట్ రేట్లు తగ్గిస్తూ ఆఫర్ అనౌన్స్ చేసి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఏదేమైనా ఈ ప్రయత్నాలు అన్ని ఫలించాయి. ఎట్టకేలకు ఈ మూవీ 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజుతో (ఫిబ్రవరి 21) ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ సాధించిన మొదటి హిందీ సినిమాగా పఠాన్ రికార్డు సృష్టించింది. 28 రోజుల్లో ఈ చిత్రం హిందీ 500 కోట్ల నెట్ షేర్ అందుకోవడంతో బాలీవుడ్ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది.