సోషల్ మీడియా “డీపీ”లు మార్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 04:39 PM IST
సోషల్ మీడియా “డీపీ”లు మార్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు

రెండు రోజుల క్రితం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, షబానా అజ్మీ, విద్యాబాలన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, సిధార్థ్ మల్హోత్రా చాధా మరియు సోను సూద్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోని డిపీ(display picture)లను మార్చారు. ట్విట్టర్,ఫేస్ బుక్ వంటి  తమ సోషల్ మీడియా అకౌంట్స్ లోని డిపీల్లో తమ ఫోటోలను తొలగించి మహారాష్ట్ర పోలీస్ లోగోను ఉంచారు. 

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా,క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి వంటి క్రీడా తారలు కూడా తమ డీపీలను మహారాష్ట్ర పోలీస్ లోగోకు మార్చారు.కరోనా వైరస్(COVID-19) మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో 6గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

విపత్తులు,దాడుల సమయంలో మహారాష్ట్ర పోలీసులు పౌరులకు అండగా నిలిచారు. ఇప్పుడు వీధుల్లో కరోనాపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న ఈ సమయంలో, ట్విట్టర్, ఫేస్బుక్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో నా డీపీని మహారాష్ట్ర పోలీసు లోగోకు మార్చడం ద్వారా వాటిని సెలబ్రేట్ చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ ప్రయత్నంలో నాతో చేరండి అంటూ శనివారం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

దేశ్ ముఖ్ పిలుపుకు బాలీవుడ్ వేగంగా స్పందించింది. షారూఖ్ ఖాన్ ఒక ట్వీట్‌లో… నేను మహారాష్ట్ర పోలీసులకు సంఘీభావం తెలుపుతున్నాను. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నిరంతరాయంగా కృషి చేసినందుకు అనిల్ దేశ్‌ముఖ్ మరియు ముంబై పోలీసులకు ధన్యవాదాలు. కరోనా పోరాటంలో ముందువరుసలో నిలబడి ఫైట్ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు చాలా కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

భయం మరియు అలసటను పక్కన పెట్టి, మాకు మొదటి స్థానం ఇస్తున్న మా ఫ్రంట్ లైన్ కార్మికుల ధైర్య సంఘటనలు ప్రతి రోజు నేను వింటున్నాను. అలాంటి ఒక హీరో మన మహారాష్ట్ర పోలీసులు. నేను గౌరవ చిహ్నంగా నా డిపిని వారికి మారుస్తున్నాను అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో 22,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.