Suahana Khan: జోయా అఖ్తర్ దర్శకత్వంలో షారుఖ్ కుమార్తె ఎంట్రీ!

బాలీవుడ్ లో మరో స్టార్ డాటర్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లుగా కనిపిస్తుంది. దక్షణాది నుండి హీరోల కూతుళ్ళకు పెద్దగా స్పేస్ లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం

Suahana Khan: జోయా అఖ్తర్ దర్శకత్వంలో షారుఖ్ కుమార్తె ఎంట్రీ!

Suahana Khan

Suahana Khan: బాలీవుడ్ లో మరో స్టార్ డాటర్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లుగా కనిపిస్తుంది. దక్షణాది నుండి హీరోల కూతుళ్ళకు పెద్దగా స్పేస్ లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్ డాటర్స్ రాజ్యమేలుతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, అనన్య పాండే, జాహ్నవి కపూర్ ఇలాంటి స్టార్ డాటర్స్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ అదిరిపోగా.. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూతురు కూడా ఎంట్రీకి సిద్ధమైంది.

షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఎంట్రీపై చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. షారుఖ్ స్నేహితుడు కరణ్ జోహార్ సుహానా ఇంట్రడ్యూస్ చేయనున్నాడని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు జోయా అక్తర్ సుహానాను పరిచయం చేయనున్నాడట. జోయా ప్రస్తుతం ఆర్చి కామిక్ బుక్ సిరీస్ (Archie Comic book series) ఆధారంగా ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. ఇందు కోసం టీనేజ్ వయసుగల గర్ల్స్ కోసం చూస్తున్నాడట.

కామిక్ బుక్ సిరీస్ ఆధారంగా అందులో గల వివిధ పాత్రల కోసం యంగ్ స్టార్స్ కోసం వేటలో ఉన్న జోయాకు షారుఖ్ కుమార్తెపై కన్నుపడిందట. ఇందులో ఓ పాత్ర కోసం సుహానాను తీసుకోవాలనుకున్న జోయా.. షారుఖ్ ను అడగడం.. కథ కూడా తన వయసుకు తగినది కావడంతో షారుఖ్ ఒకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇక సుహానా ఇప్పటికే ది గ్రే పార్ట్ అఫ్ బ్లూ షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ మొదలుపెట్టేయగా.. ఇక ఇప్పుడు ఆర్చి కామిక్ కథతో లాంచింగ్ ఒక్కటే మిగిలివుంది.