Shahrukh Khan : షారుఖ్‌ని టామ్‌క్రూజ్ తో పోల్చిన హాలీవుడ్ జర్నలిస్ట్.. మండిపడుతున్న ఫ్యాన్స్..

అమెరికాకి చెందిన ఓ హాలీవుడ్ జర్నలిస్ట్ పఠాన్ సినిమా గురించి రాస్తూ.. ఇండియా టామ్ క్రూజ్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో గత కొన్నాళ్లుగా విజయాలు లేని బాలీవుడ్ కి విజయం అందించాడు అని రాశాడు.............

Shahrukh Khan : షారుఖ్‌ని టామ్‌క్రూజ్ తో పోల్చిన హాలీవుడ్ జర్నలిస్ట్.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Shahrukh Fans fires on Hollywood Journalist for comparing shahrukh with Tom Cruise

Shahrukh Khan :  బాలీవుడ్ చాలా రోజుల తర్వాత విజయాన్ని చూసింది. షారుఖ్ ఖాన్ కూడా దాదాపు 7 సంవత్సరాల తర్వాత పెద్ద హిట్ సినిమా చూశాడు. షారుఖ్ పఠాన్ సినిమా అన్నిచోట్లా భారీ విజయం సాధించి ఇప్పటికే 696 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాతో షారుఖ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

ఇక షారుఖ్ ఖాన్ కి ఇండియాతో పాటు విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా పఠాన్ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అమెరికాలో కూడా ఓ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే పఠాన్ సినిమా అమెరికాలో 15 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో అమెరికాకి చెందిన ఓ హాలీవుడ్ జర్నలిస్ట్ పఠాన్ సినిమా గురించి రాస్తూ.. ఇండియా టామ్ క్రూజ్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో గత కొన్నాళ్లుగా విజయాలు లేని బాలీవుడ్ కి విజయం అందించాడు అని రాశాడు.

Siddharth Anand : బాయ్‌కాట్ పఠాన్ అన్నవాళ్ళు కూడా ఏదో ఒక థియేటర్ లో సినిమా చూస్తూ ఉంటారు..

దీంతో షారుఖ్ ని టామ్ క్రూజ్ తో పోల్చినందుకు షారుఖ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. షారుఖ్ ని ఎవ్వరితో పోల్చనవసరం లేదు, షారుఖ్ కి విదేశాల్లో కూడా గుర్తింపు ఉంది. కావాలంటే టామ్ క్రూజ్ ని షారుఖ్ తో పోల్చుకోండి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇందులో తప్పేముంది మంచిగా పొగుడుతూనే రాశారు కదా అంటూ ఆ హాలీవుడ్ జర్నలిస్ట్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.