Shahrukh-Salman : 27 ఏళ్ళ తర్వాత షారుఖ్, సల్మాన్ కాంబో..

గతంలో ఖుచ్ ఖుచ్ హోతాహై లాంటి దాదాపు 7 సినిమాల్లో కలిసి నటించారు షారుఖ్, సల్మాన్. చివరిసారిగా కరణ్ అర్జున్ సినిమా 1995 లో కలిసి చేశారు. దాదాపు మళ్ళీ 27 ఏళ్ళ తర్వాత ఈ కాంబో రిపీట్.........

Shahrukh-Salman : 27 ఏళ్ళ తర్వాత షారుఖ్, సల్మాన్ కాంబో..

Shahrukha

Shahrukh-Salman :  షారూక్ ఖాన్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ టైగర్ 3లో షారూక్ ఖాన్ స్పెషల్ రోల్ ఉంటుంది అన్న న్యూస్ కే ఎగిరి గంతేశారు ఖాన్స్ అభిమానులు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఆదిత్యా చోప్రా.

ఖాన్స్ అభిమానులకు పండగలాంటి ప్రకటన ఇది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో వచ్చే ఏడాది చివరికల్లా ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో ఓ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఆ సినిమాలో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలసి నటించబోతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుంది ఆదిత్యచోప్రా. 2024 ఫిబ్రవరి నుంచి లేదా మార్చి నెల నుంచే ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.

Pooja Hegde : తమిళ్ వాళ్ళకి కూడా పూజాహెగ్డేనే కావాలంట..

గతంలో ఖుచ్ ఖుచ్ హోతాహై లాంటి దాదాపు 7 సినిమాల్లో కలిసి నటించారు షారుఖ్, సల్మాన్. చివరిసారిగా కరణ్ అర్జున్ సినిమా 1995 లో కలిసి చేశారు. దాదాపు మళ్ళీ 27 ఏళ్ళ తర్వాత ఈ కాంబో రిపీట్ కానుంది. లేటెస్ట్ గా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లోనే మరో రెండు సినిమాల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే షారూఖ్ చేస్తున్న పఠాన్ లో సల్మాన్, సల్మాన్ టైగర్ 3లో షారూఖ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి హిట్ కాంబినేషన్ లో బిగ్ ప్రాజెక్ట్ ఉంటుందనే న్యూస్ ఆదిత్యా చోప్రా నుంచే రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం షారూక్ ఖాన్, దీపికా పదుకోన్ కాంబోలో పఠాన్, షారూక్ నయనతార కాంబినేషన్ లో జవాన్ లో నటిస్తున్నాడు. రాబోయే రెండేళ్లలో దాదాపు 9 సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తున్నాడు షారూక్ ఖాన్. పూజా హెగ్డేతో కబీ ఈద్ కబీ దివాలి చేస్తున్న సల్మాన్ ఖాన్, టైగర్ 3లో కత్రినా కైఫ్ తో మరోసారి జతకట్టాడు. షూటింగ్స్ తో బిజీ షెడ్యూల్ గడుపుతున్న ఖాన్లు ఇద్దరూ 2024లో భారీ సినిమాతో ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇస్తున్నట్టు తెలిపి అంచనాలు పెంచేశారు ఆదిత్యాచోప్రా.