Rocketry : ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోలిద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..

మాధవన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఓ రెండు పాత్రల కోసం షారుక్‌ఖాన్, సూర్యని అతిథి పాత్రల్లో నటించమని అడిగాను. వారు వెంటనే ఒప్పుకున్నారు. అంతేకాక..............

Rocketry : ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోలిద్దరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..

Madhavan

Madhavan :  ప్రముఖ ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణన్‌ గురించి అందరికి తెలిసిందే. ఆయనపై తప్పుడు ఆరోపణలు సృష్టించి అరెస్ట్ చేసి, చిత్ర హింసలు పెట్టారు. దేశం కోసం పని చేసిన ఆయన్ని పక్క దేశానికి మన గురించి సమాచారం ఇచ్చారని తప్పుడు ఆరోపణలతో విమర్శించి ఆయన జీవితాన్ని నాశనం చేశారు. ఆ తర్వాత అదంతా అబద్దం అని తెలిసి నంబి నారాయణన్ ని వదిలేశారు కానీ అయన జీవితంలో జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ తీర్చలేకపోయారు.

తాజాగా అయన జీవిత చరిత్రని నటుడు మాధవన్‌ మెయిన్ లీడ్ లో నటిస్తూ మొదటి సారి మెగాఫోన్‌ పట్టి స్వీయ నిర్మాణంలో దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ అనే పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా జులై 1న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాధవన్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..

మాధవన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఓ రెండు పాత్రల కోసం షారుక్‌ఖాన్, సూర్యని అతిథి పాత్రల్లో నటించమని అడిగాను. వారు వెంటనే ఒప్పుకున్నారు. అంతేకాక వారిద్దరూ ఆ పాత్రలకి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశారు. సూర్య అయితే షూట్ కోసం చెన్నై నుంచి ముంబైకి ఫ్లయిట్ టికెట్స్, వాళ్ళ స్టాఫ్ కి కూడా అతనే పెట్టుకున్నాడు” అని తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, ప్రేక్షకులు మరోసారి సూర్య, షారుఖ్ మంచితనాన్ని పొగుడుతున్నారు.