Shahrukh Khan : షారుక్, నయన్, అట్లీ.. టైటిల్ ఇదే.. రెడీ అవుతున్న యాక్షన్ మూవీ..

ఎప్పుడో కరోనాకు ముందు షారుఖ్-అట్లీ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులు కరోనా ఉండటం, షారుఖ్ తనయుడు జైలుకెళ్లడం.. ఇలాంటి వాటి మధ్య ఆల్రెడీ మొదలైన ఈ సినిమా.........

Shahrukh Khan : షారుక్, నయన్, అట్లీ.. టైటిల్ ఇదే.. రెడీ అవుతున్న యాక్షన్ మూవీ..

Shaarukh

Shahrukh Khan :  తమిళ యువ దర్శకుడు అట్లీ తీసిన నాలుగు సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులో మూడు విజయ్ తోనే చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. దీంతో ఈ సారి బాలీవుడ్ లో హిట్ కొట్టాలని ప్రయత్నించి షారుఖ్ తో సినిమా ఓకే చేసుకున్నాడు. ఎప్పుడో కరోనాకు ముందు షారుఖ్-అట్లీ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులు కరోనా ఉండటం, షారుఖ్ తనయుడు జైలుకెళ్లడం.. ఇలాంటి వాటి మధ్య ఆల్రెడీ మొదలైన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే సినిమా టీజర్ కట్ కూడా అయినట్టు, 2023లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు, ఈ సినిమా టైటిల్ ‘జవాన్’ అని పలువురు సినీ పీఆర్వోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Jr NTR : సింగపూర్ మాల్‌లో చిల్ అవుతున్న ఎన్టీఆర్..

ఈ సినిమాకు జవాన్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు, ఈ సినిమా టీజర్ ఒక నిమిషం 34 సెకన్లు ఉన్నట్లు పలువురు సినీ ప్రముఖులు తమ ట్విట్టర్ అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్, ఈ సినిమా టైటిల్ వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్న షారుఖ్ 2023లో వరుసగా పఠాన్, జవాన్, డుంకి సినిమాలు రిలీజ్ చేసి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంటూ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. షారుఖ్ ఫ్యాన్స్ కూడా అతని సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.