Shahrukh Khan : సల్మాన్ భాయ్ కోసం రానున్న పఠాన్.. ఈ ఇయర్ లోనే..

ఏప్రిల్ లో షారుఖ్ ‘టైగర్ 3’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ‘పఠాన్’ లో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ లో మెరిసినట్టు ‘టైగర్ 3’ లోనూ షారుఖ్ కనిపించడం పక్కా. ఈ ఇద్దరి కాంబోలో యాక్షన్ సీన్ ను డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ మనీష్ శర్మ..................

Shahrukh Khan : సల్మాన్ భాయ్ కోసం రానున్న పఠాన్.. ఈ ఇయర్ లోనే..

Shahrukh Khan cameo role in Salman Khan Tiger 3 Movie it will be releasing on deepavali

Shahrukh Khan :  ఒక సూపర్ స్టార్ సినిమాలో మరో సూపర్ స్టార్ క్యామియో రోల్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇద్దరూ కలిసి ఒకే స్ర్కీన్ పై ప్రత్యర్ధుల భరతం పడుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. పఠాన్ మూవీలో సల్మాన్ క్యామియో చేసినప్పుడు ఫ్యాన్స్ అలాగే ఫీలయ్యారు. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ గ్రేట్ కమ్ బ్యాక్ మూవీ ‘పఠాన్’. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇప్పటివరకు 1022 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దటీజ్ షారుఖ్ అనిపించింది. సిద్ధార్ధ్ ఆనంద్ టేకింగ్, దీపికా పదుకొనే గ్లామర్ అపీరెన్స్ , యాక్షన్స్ సీక్వెన్సెస్స్.. ఇవన్నీ ‘పఠాన్’ సినిమాను బాగా లిఫ్ట్ చేశాయి. అయితే వీటితో పాటు ఈ సూపర్ సక్సెస్ లో సల్లూ భాయ్ కు కూడా సమానమైన రోల్ ఉంది. సినిమా క్లైమాక్స్ లో క్యామియోతో మెరుపులా మెరిసి థియేటర్స్ లో మాస్ యూఫోరియాను క్రియేట్ చేశాడు సల్మాన్. ఆడియన్స్ ను మెయిన్ గా అట్రాక్ట్ చేసింది ఈ ఇద్దరి సీనే. అయితే ఈ ఎపిసోడ్ చివర్లో ‘నేను కష్టాల్లో ఉన్నపుడు కూడా నువ్వు రావాలి’ అనే సల్మాన్ డైలాగ్ నిజమయ్యే టైమొచ్చింది.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించే సినిమాలో షారుఖ్ క్యామియో రోల్ లో నటించాలని చెప్పకనే చెప్పినట్లయింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఇప్పటికే కొన్ని స్పై యాక్షన్ సినిమాలు వచ్చాయి. అందులో రెండు సల్మాన్ నటించినవే. ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’గా తెరకెక్కిన ఆ సినిమాలకు మూడో సీక్వెల్ గా ‘టైగర్-3’ రాబోతోంది. అది ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోబోతోంది. సో టైగర్ 3లో షారుఖ్ కనిపించడం ఖాయం అనే టాక్స్ వినిపిస్తున్నాయి.

Sandeep Reddy Vanga : ఒకే ఒక్క తెలుగు సినిమా సందీప్ వంగ కెరీర్ మార్చేసింది.. స్టార్లతో బాలీవుడ్ లో వరుస సినిమాలు

ఏప్రిల్ లో షారుఖ్ ‘టైగర్ 3’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ‘పఠాన్’ లో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ లో మెరిసినట్టు ‘టైగర్ 3’ లోనూ షారుఖ్ కనిపించడం పక్కా. ఈ ఇద్దరి కాంబోలో యాక్షన్ సీన్ ను డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ మనీష్ శర్మ. ఈ సినిమాలో కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరణ్ అర్జున్ లో హీరోలుగా కలిసి నటించిన షారుఖ్ అండ్ సల్మాన్ ఖాన్ చాన్నాళ్ళ తర్వాత మళ్లీ పఠాన్ లో స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. మళ్ళీ త్వరలోనే ఈ ఇద్దరూ మరోసారి ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ ఇవ్వబోతుండడం విశేషం. దీంతో ఈ సినిమా కూడా సుపర్ హిట్ కొట్టి భారీ కలెక్షన్స్ వస్తాయని బాలీవుడ్ భావిస్తుంది.