Shahrukh Khan – Salman Khan : షారుఖ్ అయిపోయింది.. నెక్స్ట్ సల్మాన్..?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అని టాక్ వినిపిస్తోంది. నాలుగేళ్ళ గ్యాప్ తో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన షారుఖ్ ఈ సినిమాతో ఇప్పుడు మాస్ ఫీస్ట్ అందిస్తున్నాడు. బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ తో మళ్ళీ బాలీవుడ్ కు...............

Shahrukh Khan – Salman Khan : షారుఖ్ అయిపోయింది.. నెక్స్ట్ సల్మాన్..?

Shahrukh Khan gets hit with pathaan now Salman Khan turn

Shahrukh Khan – Salman Khan :  బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అని టాక్ వినిపిస్తోంది. నాలుగేళ్ళ గ్యాప్ తో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన షారుఖ్ ఈ సినిమాతో ఇప్పుడు మాస్ ఫీస్ట్ అందిస్తున్నాడు. బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ తో మళ్ళీ బాలీవుడ్ కు కింగ్ ఖాన్ అయిపోయాడు. లేటెస్ట్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ స్టైలిష్ ఎంటర్ టైనర్ గా ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ అందిస్తోందని ఫస్ట్ డే నుంచే టాక్ వినిపిస్తోంది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ మలిచిన ఈ భారీ స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ మళ్ళీ బాలీవుడ్ కు పూర్వ వైభవం తెచ్చిపెట్టం ఖాయంగా కనిపిస్తోంది.

వరల్డ్ వైడ్ గా 7700 స్క్రీన్ లలో రిలీజైంది. ఒక్క ఇండియాలోనే 5200 స్క్రీన్స్ కాగా ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఒక రకంగా షారుఖ్ ఖాన్ కెరీర్ లో ఇది అత్యధిక భారీ రిలీజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీకి హిందీ తో పాటు సౌత్ లోనూ మంచి అప్రిషియేషన్ దక్కింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకి బాగానే వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. ఈ నాలుగు రోజులు హాలిడేస్ తో కలెక్షన్స్ బాగా వచ్చి బాలీవుడ్ ని నిలబెడతాయని భావిస్తున్నారు. పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ చేయడం విశేషం.

ఇక సల్మాన్ ఖాన్ వంతు మిగిలింది. ‘పఠాన్’ రిలీజైన థియేటర్స్ లో సల్మాన్ ఖాన్ ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ టీజర్ రిలీజైంది. ఆల్రెడీ పఠాన్ మూవీ సెకండాఫ్ లో సల్మాన్ ఖాన్ క్యామియో అపీరెన్స్ ఇచ్చాడు. దాంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఫర్హద్ సంమ్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ కూడా యాక్షన్ ప్యాక్డ్ మూవీనే. అయితే ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్నాడు. దాంతో ఫ్యామిలీ రిలేషన్స్ కు కూడా ఈ సినిమాలో స్పేస్ ఇచ్చారు. సల్లూభాయ్ ఎర్లియర్ గా నటించిన ఫుల్ లెంత్ మూవీ ‘అంతిమ్’. అది అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఈ ఏడాది ఈద్ కానుకగా ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ మూవీ రిలీజ్ కాబోతోంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి.

Sharwanand : సైలెంట్ గా నిశ్చితార్థం చేసేసుకున్న శర్వానంద్.. ఎవర్నో తెలుసా??

2022 బాలీవుడ్ కు నైట్ మేర్ లాంటి సంవత్సరం. వచ్చిన సినిమా వచ్చినట్టుగా ఫ్లాప్ అవడంతో క్రైసిస్ లో పడింది. అయితే 2023 ఇయర్ ను షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ బిగ్గెస్ట్ హిట్ తో బోణీ చేసి మళ్ళీ బాలీవుడ్ కు ఊపిరిలూదాడు. సల్మాన్ ఖాన్ సైతం తన లేటెస్ట్ మూవీతో హ్యూజ్ హిట్ అందుకుంటే బాలీవుడ్ తిరిగి గాడిలో పడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి సల్మాన్ ఖాన్ కూడా షారుఖ్ బాటనే అనుసరించి హిట్ కొడతాడేమో చూడాలి.