Pathaan : అదిరిపోతున్న పఠాన్ ప్రీ బుకింగ్స్.. మరోవైపు బాయ్‌కాట్ పఠాన్.. షారుఖ్ బాలీవుడ్ ని గట్టెక్కిస్తాడా??

నాలుగేళ్ళ క్రితం వచ్చిన షారుఖ్ ‘జీరో’ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత షారుఖ్ నుంచి మరో సినిమా రాలేదు. నెక్స్ట్ మూవీ ‘పఠాన్’ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా...............

Pathaan : అదిరిపోతున్న పఠాన్ ప్రీ బుకింగ్స్.. మరోవైపు బాయ్‌కాట్ పఠాన్.. షారుఖ్ బాలీవుడ్ ని గట్టెక్కిస్తాడా??

Shahrukh Khan Pathaan Movie create record pre Bookings

Pathaan :  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సాలిడ్ కమర్షియల్ సక్సెస్ దక్కించుకొని చాలా రోజులే అయింది. అయినా సరే స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన సినిమా రిలీజై నాలుగేళ్ళు అయినప్పటికీ నెక్స్ట్ మూవీ ‘పఠాన్’ పై ఉన్న అంచనాలు మాత్రం స్కై హై. రికార్డు ఫిగర్స్ తో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో రిజిస్టర్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

నాలుగేళ్ళ క్రితం వచ్చిన షారుఖ్ ‘జీరో’ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత షారుఖ్ నుంచి మరో సినిమా రాలేదు. నెక్స్ట్ మూవీ ‘పఠాన్’ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది సినిమా. సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. షారుఖ్ గత సినిమాల రిజల్ట్స్ వల్ల, చాలా గ్యాప్ వల్ల పఠాన్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ పఠాన్ మాత్రం రిలీజ్ డే వరకు ఏకంగా 5 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్.

దేశంలో చాలా చోట్ల ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకు లేని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ పఠాన్ సినిమాకి వస్తున్నాయట. పఠాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ తోనే దాదాపుగా 20 నుండి 25 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసేలా ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. ఇక రిలీజ్ ముందు రోజు వరకు జరిగే ప్రి సేల్స్, ఫస్ట్ డే కూడా కలుపుకుంటే ఈజీగా రూ.50 కోట్ల మార్కును ‘పఠాన్’ టచ్ చేసేలా కనిపిస్తోంది. వరుసగా డిజాస్టర్లు చూసిన షారుఖ్ ఇలాంటి రికార్డుతో కంబ్యాక్ ఇవ్వబోతుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సిద్ధార్ధ్ ఆనంద్ లాంటి యాక్షన్ డైరెక్టర్ తెరకెక్కించడం, దీపికా పదుకొణే లాంటి హీరోయిన్ గ్లామర్ అపీరెన్స్ ఈ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతున్నాయి.

Harish Shankar : బాలయ్యతో సినిమా తీస్తా అన్న హరీష్ శంకర్.. మరి ఉస్తాద్ భగత్ సింగ్??

ఓ వైపు ట్విట్టర్లో బాయ్ కాట్ పఠాన్ ట్రెండ్ నడుస్తున్న పాఠాన్ని కి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. మొన్నటి వరకు కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి బాగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు రెండు, మూడు తప్ప పెద్దగా లేవు. ఈ సినిమాతో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి భారీ కలెక్షన్స్, భారీ హిట్ సాధిస్తే బాలీవుడ్ కి బాద్ షా ఊపిరి పోసినవాడవుతాడు. ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు కూడా అదే కోరుకుంటున్నాయి. ఓ టెర్రరిస్ట్ సంస్థ ఇండియాని నాశనం చేయాలని చూడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిన రా ఏజెంట్ పఠాన్ వచ్చి ఎలా కాపాడతాను అనే అంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.