షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వడంలేదు – షకీలా ఆవేదన

‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టనర్ - ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ప్రెస్‌మీట్‌లో షకీలా..

  • Published By: sekhar ,Published On : February 3, 2020 / 07:17 AM IST
షకీలా సినిమా అంటేనే సెన్సార్ ఇవ్వడంలేదు – షకీలా ఆవేదన

‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టనర్ – ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ప్రెస్‌మీట్‌లో షకీలా..

ష‌కీల ప్రధాన పాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌‌పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో
న‌టి షకీల మాట్లాడుతూ : ‘‘నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో ఉంది.

Shakeela

షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌ టనర్’’ అన్నారు.

Read Also : ఏటీఎమ్‌లో ఏం జరిగింది ? – కింగ్ నాగ్ చేతుల మీదుగా ‘22’ టీజర్ రిలీజ్

దర్శకుడు సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ : ‘‘కొత్తగా ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ : ‘‘గత చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’కి సహ నిర్మాతగా పనిచేశాను. ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సాయిరాం దాసరి కొత్తగా ప్రయత్నించాడు. కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మిత్ర, నటుడు హర్ష తదితరులు పాల్గొన్నారు. షకీలా, విక్రాంత్, పల్లవి ఘోష్, నల్లబెల్లి, తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ : సాయిరాం దాసరి, దర్శకత్వం : సతీష్ విఎన్, నిర్మాత : సి హెచ్ వెంకట రెడ్డి, సహ నిర్మాత : లండన్ గణేష్, ఆడియోగ్రఫీ : శ్రీ మైత్రా, ఎడిటర్ : కెఆర్ స్వామి, డిఓపి : శ్యామ్ ప్రసాద్, తరున్ కరామ్‌తోత్‌.

Shakeela