Shakunthalam : శాకుంతలం సినిమాకు అన్ని అవార్డులు వచ్చాయా?.. దారుణంగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..

శాకుంతలం ఓటీటీ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చాయంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

Shakunthalam : శాకుంతలం సినిమాకు అన్ని అవార్డులు వచ్చాయా?.. దారుణంగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..

Shakunthalam movie gets international awards and netizens trolling

Shakunthalam :  ఇటీవల సమంత(Samantha) నటించిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజయింది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కింది. సమంత, దేవ్ మోహన్(Dev Mohan), మోహన్ బాబు(Mohan Babu), అల్లు అర్హ(Allu Arha), అనన్య నాగళ్ళ.. పలువురు ముఖ్య పాత్రల్లో చేసిన శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు.

కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా నిర్మాతలకు షాక్ ఇచ్చింది ఈ సినిమా. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ అయి పెద్ద షాక్ ఇచ్చిందని స్వయంగా చెప్పారు. దాదాపు ఈ సినిమా వల్ల 30 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు సమాచారం. శాకుంతలం రిలీజయి నెల అవ్వకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

శాకుంతలం ఓటీటీ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చాయంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో శాకుంతలం సినిమా..
#న్యూయార్క్ ఫిలిం ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2023 లో.. బెస్ట్ ఫాంటసీ ఫిలిం, బెస్ట్ మ్యూజికల్ ఫిలిం అవార్డ్స్
#అమెరికన్ గోల్డెన్ పిక్చర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఏప్రిల్ లో – బెస్ట్ ఫిలిం ఆన్ వుమెన్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫీచర్ ఫిలిం, బెస్ట్ ఫీచర్ నేరేటివ్ అవార్డ్స్
#ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఏప్రిల్ లో – బెస్ట్ డైరెక్టర్ ఫీచర్ ఫిలిం(స్పెషల్ జ్యూరీ), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డ్స్
#కాన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఏప్రిల్ – అఫీషియల్ సెలక్షన్.. ఇలా పలు అవార్డులు వచ్చినట్టు పోస్టర్ వేశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ల సంగీతం.. NTR30 టు Nani30..

అయితే ఓ డిజాస్టర్ ఫిలింకి ఎక్కడో విదేశాల్లో ఎవరికీ తెలియని అవార్డులు వచ్చాయని పోస్టర్స్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారని నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు అవార్డులు ఎలా ఇచ్చారు, ఎవరూ ఇవ్వలేదని మీరే తెచ్చుకున్నారా, కార్టూన్ మూవీ అవార్డు ఇవ్వాల్సింది, అన్ని అవార్డులు ఇవ్వడానికి ఆ సినిమాలో ఏముంది, సీరియల్స్ కి అవార్డులు ఇస్తున్నారా, ఇన్ని అవార్డ్స్ అంటే మాకు నమ్మకం లేదు సర్.. అని ఇలా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం అవి అక్కడ లోకల్ గా చిన్న అవార్డ్స్ అయి ఉంటాయి, తక్కువ మంది అప్లై చేస్తే వచ్చి ఉంటాయి అని అభినందనలు కూడా తెలుపుతున్నారు. ఇక సినిమా ఫ్లాప్ అయిన దగ్గర్నుంచి సమంత ఇప్పటివరకు శాకుంతలం గురించి మాట్లాడకపోవడం గమనార్హం.