RC 15 : మెగా పవర్ స్టార్ మెట్రో ఫైట్..

శంకర్ - చరణ్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న RC 15 రెగ్యులర్ షూటింగ్ మెట్రో ఫైట్‌తో స్టార్ట్ కానుంది..

RC 15 : మెగా పవర్ స్టార్ మెట్రో ఫైట్..

Rc 15

RC 15: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబోలో రానున్న RC 15 సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.. సినిమా ఓపెనింగ్ రోజు వుయ్ ఆర్ కమింగ్ అంటూ ఆర్టిస్టులు, టెక్నీషిన్లు అందరూ సూట్స్ వేసుకుని పోస్టర్ రిలీజ్ చెయ్యగా బాగా వైరల్ అయ్యింది.

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

ఇక రెగ్యులర్ షూటింగ్ విషయానికొస్తే.. యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు టీం. ఇందుకోసం పూణెలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారట. ఈ స్టైలిష్ అండ్ మాస్ మెట్రో ఫైట్ సినిమాలో మేజర్ హైలెట్ అంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ రిహార్సల్స్ పూర్తి చేశాడట.

Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!

‘వినయ విధేయ రామ’ తర్వాత కియారా అద్వాణీ చెర్రీతో జతకడుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. మొత్తం ఏడు పాటలుంటాయని, ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశానని ఇటీవల చెప్పుకొచ్చాడు.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!