RC 15: రామ్ చరణ్ సినిమాపై శంకర్, థమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిజీ బిజీగా మారిపోయాడు. చెర్రీ ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా తండ్రి మెగాస్టార్..

RC 15: రామ్ చరణ్ సినిమాపై శంకర్, థమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ వైరల్!

Rc 15

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిజీ బిజీగా మారిపోయాడు. చెర్రీ ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ తో కలిసి మరో క్రేజీ పాన్ ఇండియా సినిమాకు సిద్దమయ్యాడు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లో భారీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించగా ఈ సందర్భంగా షూట్ బిగిన్ పోస్టర్ కూడా మంచి అప్లోజ్ సొంతం చేసుకుంది.

దర్శక దిగ్గజం శంకర్, పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్ కాంబినేషన్ అనౌన్సమెంట్ టైంలో ఎలాంటి హైప్ దక్కించుకుందో.. షూటింగ్ బిగినింగ్ ఈవెంట్ తో మళ్ళీ ఈ సినిమా ట్రాన్స్ కొనసాగుతుంది. ఘనంగా నిర్వహించిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి పలువురు బడా స్టార్స్ ముఖ్య అతిధులుగా హాజరవడంతో పాటు టోటల్ సినిమా కాస్టింగ్ క్రూను కూడా ప్రకటించడంతో ఈ సినిమా మీద ఎవరికి వారు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు.

ఇక, షూట్ లాంఛన ప్రారంభ కార్యక్రమం తర్వాత దర్శకుడు శంకర్ ఒక్కొక్కరిని ఉద్దేశించి తన ట్విట్టర్ లో పలు పోస్ట్స్ పెట్టారు. ఈ పోస్టులు కూడా వైరల్ గా మారాయి. ముఖ్యంగా సినిమా సంగీత దర్శకుడు థమన్ పై చేసిన ట్వీట్స్ అభిమానులను అట్రాక్ట్ చేశాయి. ఇప్పటికే మనం రికార్డ్ చేసిన ఫస్ట్ సాంగ్ అదిరే లెవెల్లో వచ్చిందని జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉండగా ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తయినట్లు థమన్ తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పడంతో ఈ పాటలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తిగా మారింది.