Ram Charan: చరణ్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేస్తున్న శంకర్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే....

Ram Charan: చరణ్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేస్తున్న శంకర్..?

Shankar To Fix Title For Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?

కాగా ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఒక పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తూ వస్తుంది. ‘అధికారి’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే ఈ టైటిల్ సినిమా కథకు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని అటు దర్శకుడు శంకర్‌తో పాటు హీరో చరణ్ కూడా భావిస్తున్నాడట.

Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?

మరి నిజంగానే ఈ సినిమాకు అధికారి అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా లేక, ఈ సినిమాకు మరో టైటిల్‌ను ఓకే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.