Bigg Boss 5: సారీ సారీ అంటూనే హగ్గులు.. ముద్దులు.. అరే ఏంట్రా ఇది!

బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్ల విషయంలో అసంతృప్తితో ఉన్న నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. రాను రాను సీజన్ మారేకొద్దీ కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు..

Bigg Boss 5: సారీ సారీ అంటూనే హగ్గులు.. ముద్దులు.. అరే ఏంట్రా ఇది!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్ల విషయంలో అసంతృప్తితో ఉన్న నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేశారు. రాను రాను సీజన్ మారేకొద్దీ కంటెస్టెంట్ల విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు లైట్ తీసుకున్నారనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే.. వారం గడిచే కొద్దీ రొమాన్స్ విషయంలో కొన్ని జంటలు రోజురోజుకు డోస్ పెంచుతూ వచ్చాయి. శ్రీరామ్-హమీదా మధ్య లవ్ ట్రాక్ లో పీక్స్ ఉండగా హమీదాను ఎలిమినేషన్ చేయడంతో మళ్ళీ నెటిజన్లు ఉసూరుమన్నారు. అయితే.. ఫ్రెండ్స్ అంటూనే షణ్ముఖ్-సిరి ఈ లోటు భర్తీ చేస్తున్నారేమో అనిపిస్తుంది.

OTT Films: తగ్గేదేలే.. వచ్చే వారం ఓటీటీలో రచ్చ రచ్చే!

ఒక్కోసారి ఈ ఇద్దరూ పరిస్థితులను మర్చిపోయి ఘాటైన కౌగిలింతలో మునిగితేలుతున్నారు. ముద్దులతో రెచ్చిపోతున్నారు. అరే ఏంట్రా ఇది అంటూనే షణ్ముఖ్ సిరి సావాసంలో తెగ మురిసిపోతున్నాడు. గురువారం ఎపిసోడ్ లో ఈ జంట రొమాన్స్ మరోసారి పీక్స్ కి చేరింది. ష‌ణ్ముఖ్ మరోసారి దీప్తి సున‌య‌న‌ను గుర్తు చేసుకుని టాటూ చూసుకుంటూ గడిపేస్తుండగా సిరి తన శ్రీహాన్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. అనంతరం సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేప‌ర్ మీద రాసి షన్నుకి ఇచ్చేసింది.

Nikki Tamboli: ఫోజులతోనే పిచ్చెక్కించే నిక్కీ!

సిరి చేసిన పనికి కాస్త ఫీల్ అయిన షన్ను సిరికి సారీ చెప్పాడు. పదే పదే సారీ చెప్పిన తర్వాత సిరి షన్నుకి గట్టిగా హగ్ ఇచ్చింది. ఊరికే హగ్ అనుకుంటే పొరపాటే.. సిరి షణ్ముక్ ని పట్టుకుని ఏడుస్తూ ముద్దుపెడుతూ హగ్ ఇచ్చింది. అనంతరం ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చుకుంటూ మెల్లగా అక్కడ నుండి జారుకున్నారు. అయితే, ​లిప్ కిస్ పెట్టిన సిరిని చూస్తూ ముఖం తిప్పుకుని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు షణ్ముక్. అంతేకాదు, అక్కడ హగ్ ఇచ్చి ఏడ్చి వెళ్లిపోయిందా అంటూ డైలాగ్ కూడా ఒకటి వేసి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, కెమెరాలుండే.. అది టీవీల్లో వచ్చేసే ఫాఫం.