Bigg Boss 5: ఇంటి చివరి కెప్టెన్‌గా షణ్ముక్.. పక్కా ప్లాన్ వేసి మరీ!

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ 13వ వారానికి చేరుకుంది. కాగా.. ఈ సీజన్ చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ ఎంపిక అయ్యాడు. అయితే.. ఇది పక్కా షణ్ముఖ్ ప్లాన్ గా క్లియర్ గా కనిపించింది..

Bigg Boss 5: ఇంటి చివరి కెప్టెన్‌గా షణ్ముక్.. పక్కా ప్లాన్ వేసి మరీ!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ 13వ వారానికి చేరుకుంది. కాగా.. ఈ సీజన్ చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ ఎంపిక అయ్యాడు. అయితే.. ఇది పక్కా షణ్ముఖ్ ప్లాన్ గా క్లియర్ గా కనిపించింది.. హౌస్ మేట్స్ కూడా ముందు నుండి అదే మాట చెప్పారు. ఇంట్లో షణ్ముఖ్ ఎలా గేమ్ ఆడుతున్నాడు.. ఇక్కడ వరకు ఎంత తెలివిగా ఆడుతూ వచ్చాడన్నది ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. తాను కెప్టెన్ అయ్యేందుకు ఉన్న అవకాశాన్ని రవి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చినట్లుగా కెప్టెన్ కుర్చీని కొట్టేశాడు.

Keerthy Suresh: కీర్తి పిచ్చ క్యూట్ ఫోటోస్!

ముందుగా కెప్టెన్సీ పోటీదారులుగా చివరకి రవి, సిరి, షణ్ముక్ ఇంకా ప్రియాంకలు మాత్రమే మిగిలగా.. ఫస్ట్ ఛాలెంజస్ ఆడిన తర్వాత ప్రియాంక, సిరి ఇద్దరూ తప్పుకోగా చివరికి రవికి ఇంకా షణ్ముక్ పోటీకి నిలిచారు. ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాడు. ఇక్కడే షణ్ముఖ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. నియంత మాటే శాసనం ఐదో రౌండ్ ఆడుతున్నప్పుడు షణ్ముక్ సింహాసనంపై నియంతగా కూర్చున్నాడు. రవి, పింకీలలో ఒకర్ని కాపాడే ఛాన్స్ షణ్ముక్ కి రాగా రవిని కాపాడాడు.

Peddanna: సందడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్!

పింకీ తను ఇప్పటివరకూ కెప్టెన్ అవ్వలేదని.. ఇదే నా లాస్ట్ అండ్ ఫస్ట్ ఛాన్స్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా.. నాలాంటి వాళ్లకి ఎంతోమందికి నేను ఇన్స్ పిరేషన్ గా ఉండాలనుకుంటున్నాని, బయటకి వెళ్లాక బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా ఉన్నాని అందరితో చెప్పుకుంటాను అని ప్రాధేయపడింది. హౌస్ మేట్స్ కొందరు పింకీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినా.. షణ్ముక్ చాలా సీరియస్ అయ్యాడు. అసలు ఆ మాట నువ్వు తీసుకురావడమే చాలా తప్పు అని నేను వెధవ అని ముద్రవేయడానికే ఇలా చేస్తున్నావా ఇలా మాట్లాడుతున్నావా అంటూ అరిచాడు.

Prabhas: ప్రభాస్ ముందు ఖాన్లు, కపూర్లు, స్టార్లంతా చిన్నవాళ్ళేనా!

అయితే, ఇక్కడ రవిని ఎందుకు సేవ్ చేశాడంటే.. రవికి హౌస్ లో ఎవరి సపోర్ట్ ఉండదని మహా అయితే రెండు ఓట్లు వస్తాయి. మిగతావి తనకే వస్తాయి కాబట్టి షణ్ముఖ్ తను ఈజీగా కెప్టెన్ అయిపోవచ్చు. ఇదే మాస్టర్ మైండ్ తో షణ్ముఖ్ ఆడాడని చూసే ప్రేక్షకులకు అర్ధమవగా.. ఇంట్లో మానస్ కూడా అదే అన్నాడు. షణ్ముఖ్ అనుకున్నట్లే రవికి ఒక్క శ్రీరామచంద్ర ఓటేయగా మిగతా వాళ్ళు షణ్ముఖ్ కు ఓటేసి చివరి కెప్టెన్ అయ్యాడు. అయితే.. తనను సేవ్ చేయమని బ్రతిమాలినా వినలేదని పింకీ చాలా డిసప్పాయింట్ అయింది. వాష్ రూమ్ చెంపలు వాయించుకోడం.. నుదిటిపై చేత్తో కొట్టుకోడం.. మిగతా వాళ్ళు ఎంత సముదాయించినా పింకీ నార్మల్ కాలేకపోయింది.