Shannu Deepu : షణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోవడానికి కారణం ఎవరు?

ఏమైందో తెలీదు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విడిపోతున్నట్టు ప్రకటించడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. అయితే వీళ్ళు ఇద్దరు విడిపోవడానికి కారణం ఏంటి, ఎవరు అని......

Shannu Deepu :  షణ్ముఖ్ దీప్తి సునైనా విడిపోవడానికి కారణం ఎవరు?

Shannu Deepu

Shannu Deepu :   షణ్ముఖ్, దీప్తి సునైనా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఫేమస్ కపుల్. ఈ జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. కొన్ని సార్లు ఇండైరెక్ట్ గా, కొన్ని సార్లు డైరెక్ట్ గానే చెప్పారు ఈ విషయాన్ని. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు. వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోను నటించారు. అంతేకాక ఇద్దరూ కలసి ట్రిప్స్ కి కూడా వెళ్తూ ఉంటారు. వీళ్ళ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

గతంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా విడిపోతున్నట్టు దీప్తి తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టింది. దానికి రిప్లైగా షణ్ముఖ్ కూడా విడిపోతున్నాము అంటూ పోస్ట్ పెట్టాడు. షణ్ముఖ్ ఇటీవల బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా దీప్తి షణ్ముఖ్ కి బాగా సపోర్ట్ చేసింది. షన్ను కోసం బిగ్ బాస్ కి కూడా వెళ్లి తన ప్రేమని చూపించింది. షన్ను కూడా హౌస్ లో రోజూ దీప్తిని తలుచుకునేవాడు. వీళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇష్టమైతే మాకు ఓకే అని పెళ్ళికి కూడా సపోర్ట్ ఇచ్చారు. మరి ఏమైందో తెలీదు బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విడిపోతున్నట్టు ప్రకటించడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. అయితే వీళ్ళు ఇద్దరు విడిపోవడానికి కారణం ఏంటి, ఎవరు అని ఆలోచిస్తున్నారు అభిమానులు.

Raviteja : నా వెనక ఉండి రాజకీయాలు చేశారు : రవితేజ

వీళ్లిద్దరు విడిపోవడానికి ముఖ్య కారణం సిరి హనుమంత్ అనే అనుకుంటున్నారు అంతా. ఎందుకంటే గతంలో వీళ్ళ మధ్య చాలా సార్లు గొడవలొచ్చినా మళ్ళీ కలిసిపోయారు. అయితే బిగ్ బాస్ లో షణ్ముఖ్, సిరి ఫ్రెండ్స్ అంటూనే రోజు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఒకరి ఒళ్ళో ఒకరు పడుకోవడం లాంటివి చేశారు. కొన్ని ఎపిసోడ్స్ లో హద్దు మీరినట్లు కూడా అనిపించింది ప్రేక్షకులకి. దీనిపై కొంతమంది విమర్శలు కూడా చేశారు. షణ్ముఖ్, సిరి మరీ ఓవర్ చేస్తున్నారు అంటూ కామెంట్లు కూడా చేశారు. వీళ్లిద్దరు క్లోజ్ గా ఉండటమే షణ్ముఖ్, దీప్తి మధ్య దూరం పెంచిందా అని అంటున్నారు కొంతమంది.

అయితే దీప్తి కూడా అంతకుముందు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఎలా ఉంటుందో తనకు తెలుసు. ఇదంతా స్క్రిప్ట్ అని దీప్తికి కూడా తెలుసు. అలాంటిది ఈ విషయానికి ఐతే వీళ్ళు విడిపోరు అని కూడా కొంతమంది అంటున్నారు. పోనీ కెరీర్ పరంగా విభేదాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇద్దరిది ఒకటే కెరీర్. పోనీ ఫైనాన్సియల్ గా అంటే ఇద్దరు ఇప్పుడు బాగా సెటిల్ అయినా వాళ్ళే. గతంలో ఈ విషయంలో దీప్తి షణ్ముఖ్ కి సపోర్ట్ చేసింది. ఆ విషయం బిగ్ బాస్ లోనే చెప్పాడు. బిగ్ బాస్ అయ్యాక తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను అని కూడా చెప్పాడు. మరి వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మాత్రం తెలీదు.

Krishna : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు.. సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం..

కొన్ని రోజుల క్రితం సమంత నాగ చైతన్య విడాకులు సోషల్ మీడియాలో ఎంత హల్ చల్ సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరి బ్రేకప్ కూడా సోషల్ మీడియాలో అంతే వైరల్ అవుతుంది. కానీ కొంతమంది అభిమానులు వీరిద్దరూ కలిసి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఇద్దరం కలిసి ఉండలేమని ఒకరికి ఒకరు థ్యాంక్స్ చెప్పుకొని విడిపోయారు. మరి వీళ్ళ బ్రేకప్ కి కారణం మాత్రం ఎవ్వరికి తెలీదు. కొంతమంది సన్నిహితులు దీనిపై ఆరా తీస్తున్నారట.