Shanmukh Jaswanth : బిగ్‌బాస్ లాంటి షోలో నేను సెట్ అవ్వను.. నా మీద చాలా నెగిటివిటీ వచ్చింది..

షణ్ముఖ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ గురించి మాట్లాడుతూ.. ‘‘నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోకి నేను సెట్‌ కాను. నేను చాలా మూడీగా ఉండే వ్యక్తిని. ఎదుటివారితో....

Shanmukh Jaswanth :  బిగ్‌బాస్ లాంటి షోలో నేను సెట్ అవ్వను.. నా మీద చాలా నెగిటివిటీ వచ్చింది..

Shanmukh

Shanmukh Jaswanth :  సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. షోలో ఎప్పుడూ సైలెంట్ గా ఉంటూ, అప్పుడప్పుడు ఫైర్ అవుతూ, సిరితో రొమాన్స్ చేస్తూ బిగ్‌బాస్ జరిగినంతకాలం వార్తల్లో నిలిచాడు షణ్ముఖ్. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక దీప్తితో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే మరో వెబ్ సిరీస్ ని కూడా అనౌన్స్ చేశాడు. తాజాగా నిన్న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలని వెల్లడించాడు షణ్ముఖ్.

 

షణ్ముఖ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ గురించి మాట్లాడుతూ.. ‘‘నా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోకి నేను సెట్‌ కాను. నేను చాలా మూడీగా ఉండే వ్యక్తిని. ఎదుటివారితో చాలా తక్కువగా కలుస్తుంటాను. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడం కోసమే నేను బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నాను. ఆ షోలో ఉన్నప్పుడు నా గురించి ప్రేక్షకులు పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారనుకున్నాను. కానీ నాపై ఎంతటి నెగెటివిటీ వచ్చిందో హౌస్‌ నుంచి బయటకు వచ్చాకే తెలిసింది. ప్రస్తుతం నా వయసు 27 సంవత్సరాలు. కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కానీ బాధ పడుతూ కూర్చోలేను కదా. ఒక పక్క బాధగా ఉన్నా ఎదురుదెబ్బల వల్ల జీవితంలో ముందుకు ఎలా సాగాలి అనేది నేర్చుకుంటున్నాను’’ అని తెలిపారు.

Shanmukh – Deepthi : సిరితో క్లోజ్‌గా ఉండటం వల్లే దీప్తితో బ్రేకప్.. షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు..

ఇక ఇదే ఇంటర్వ్యూలో సిరి గురించి, దీప్తి గురించి, దీప్తితో బ్రేకప్ జరిగిన విషయం గురించి మాట్లాడాడు షణ్ముఖ్. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత షణ్ముఖ్ ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ అవ్వడంతో షన్ను అభిమానులు, బిగ్‌బాస్ ప్రేక్షకులు ఈ ఇంటర్వ్యూని చూస్తూ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.