Shanmukh Jaswanth : ఫేవరేట్ హీరోని కలిసిన ఆనందంలో షన్ను.. తనే వచ్చి షన్నుకి హగ్ ఇచ్చిన సూర్య

'ఈటి' సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య హైదరాబాద్ కి వచ్చారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సూర్య. ఈ ఇంటర్వ్యూ టైంలో షన్ను సూర్యని కలవడానికి వెళ్ళాడు.......

Shanmukh Jaswanth : ఫేవరేట్ హీరోని కలిసిన ఆనందంలో షన్ను.. తనే వచ్చి షన్నుకి హగ్ ఇచ్చిన సూర్య

Surya

Surya :  యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తన వెబ్‌సిరీస్‌లతో బాగా ఫేమస్ అయ్యాడు. ఎక్కువ సబ్‌స్క్రయిబర్లు కలిగిన మొదటి తెలుగు యూట్యూబర్ గా రికార్డు కూడా సాధించాడు. సోషల్ మీడియాలో కూడా షణ్ణుకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల గత సీజన్ బిగ్‌బాస్‌‌లో కూడా పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక కొన్ని రోజులు టైం తీసుకొని మరో కొత్త వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేశాడు షన్ను.

అయితే బిగ్‌బాస్‌ వల్ల షన్ను మీద కొంచెం నెగిటివిటి ఏర్పడింది. బిగ్‌బాస్‌ లో సిరితో క్లోజ్ గా ఉండటం వల్ల విమర్శలు కూడా ఎదుర్కున్నాడు, బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక దీప్తి సునయన బ్రేకప్ చెప్పింది. ఇలా వరుసగా షణ్ణుకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టు ఉంది. తాజాగా షన్నుకి బాగా సంతోషం కలిగించే సంఘటన జరిగింది. షన్ను హీరో సూర్యకి ఎప్పట్నుంచో డై హార్డ్ ఫ్యాన్. సూర్యని ఒక్కసారైనా కలవాలని తన కోరిక. తాజాగా షన్ను కోరిక తీరింది.

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ మొదటి వారం కెప్టెన్ ఎవరో తెలుసా??

‘ఈటి’ సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య హైదరాబాద్ కి వచ్చారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సూర్య. ఈ ఇంటర్వ్యూ టైంలో షన్ను సూర్యని కలవడానికి వెళ్ళాడు. సూర్యని చూసి షన్ను చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాడు. ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వాళ్ళు షన్ను గురించి సూర్యకి చెప్పడంతో సూర్యనే వచ్చి షన్నుతో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ చేసుకున్నాడు. దీంతో షన్ను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా ఆనందించాడు. తన ఫేవరేట్ హీరోని కలవడమే కాక తన ఫేవరేట్ హీరోనే వచ్చి మాట్లాడి హగ్ ఇవ్వడంతో షణ్ముఖ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Nithya Menon : ‘భీమ్లానాయక్’ టీంపై హర్ట్ అయిన నిత్యామీనన్.. ప్రమోషన్స్‌లో అందుకే పాల్గొనలేదా??

సూర్యతో కలిసిన ఆనంద క్షణాలని షణ్ముఖ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ షన్నుని అభినందిస్తున్నారు.