Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నుంచి మరో సిరీస్.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ప్రాజెక్టు

తాజాగా మరో కొత్త సిరీస్ ని అనౌన్స్ చేసాడు షణ్ముఖ్ జస్వంత్. తన కొత్త సిరీస్ టైటిల్ ని రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు షన్ను. తన కొత్త సిరీస్ టైటిల్.........

Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నుంచి మరో సిరీస్.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ప్రాజెక్టు

Shannu

Shanmukh Jaswanth :  సోషల్ మీడియా స్టార్, యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాడు. గతంలో అతను చేసిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ‘సూర్య’ సిరీస్ లు భారీ విజయం సాధించాయి. యూట్యూబ్ లో ఈ రెండు సిరీస్ లు రికార్డులు సృష్టించాయి. వీటితో నాలుగు మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ సాధించిన తొలి తెలుగు యూట్యూబర్ గా రికార్డు సృష్టించాడు షణ్ముఖ్.

ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో బిగ్‌బాస్ కి వెళ్లి రన్నర్ గా వచ్చాడు. ఇక ఇప్పటికే షణ్ముఖ్ హీరోగా సినిమా మొదలయ్యాయి అనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో తాజాగా మరో కొత్త సిరీస్ ని అనౌన్స్ చేసాడు షణ్ముఖ్ జస్వంత్. తన కొత్త సిరీస్ టైటిల్ ని రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు షన్ను.

Saina Nehwal : హీరో సిద్దార్థ్ పై పరువు నష్టం దావా.. సమన్లు జారీ చేసిన చెన్నై పోలీసులు

తన కొత్త సిరీస్ టైటిల్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అని అనౌన్స్ చేశాడు. గతంలో రెండు సిరీస్‌లని తెరకెక్కించిన డైరెక్టర్ సుబ్బునే దీనికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ పోస్టర్ పోస్ట్ చేస్తూ.. ”బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక ముందు యూట్యూబ్ సిరీస్‌నే చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు పేరు వచ్చింది, నేను సక్సెస్ అయింది యూట్యూబ్ నుంచే. మీ వల్లే. అందుకే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ మరో సిరీస్‌తో వస్తున్నాను. ఈ సారి సిరీస్ చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఈ సిరీస్ చూసి మీరు నవ్వుతూ మీ టెన్షన్స్ అంతా మర్చిపోతారు” అని పోస్ట్ చేశాడు. దీంతో షన్ను ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.