Bigg Boss 5 : మళ్ళీ హగ్గులంటూ మొదలుపెట్టిన సిరి.. ఇవ్వాలా వద్దా అని షణ్ముఖ్‌

సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. అయితే గత ఎపిసోడ్స్ లో సిరి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు షణ్నుకి సిరి హాగ్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పింది. ఇందుకు షణ్ను చాలా ఫీల్......

Bigg Boss 5 : మళ్ళీ హగ్గులంటూ మొదలుపెట్టిన సిరి.. ఇవ్వాలా వద్దా అని షణ్ముఖ్‌

Siri Shannu

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ రసవత్తరంగా సాగుతుంది. ఫైనల్ కి ఎవరు ముందు వెళ్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంట్లో చాలా రౌండ్స్ ఉన్నాయి. ఒక్కో రౌండ్ లో ఒక్కొక్కరు ముందు వరుసలో ఉంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, ప్రియాంక, కాజల్‌, సన్నీవరుస స్థానాల్లో ఉన్నారు. ఈ రౌండ్ లో షణ్ముఖ్, సిరి టాప్ 3లో ఉండటంతో సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది.

Anand Devarakonda : సైకోగా ఆనంద్ దేవరకొండ.. బాలీవుడ్ స్టార్లతో కలిసి కొత్త ప్రయోగం

అయితే గత ఎపిసోడ్స్ లో సిరి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు షణ్నుకి సిరి హాగ్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని చెప్పింది. ఇందుకు షణ్ను చాలా ఫీల్ అయ్యాడు. అప్పట్నుంచి షణ్ను సిరికి గేమ్ లో సపోర్ట్ చేస్తున్నాడు కానీ పర్సనల్ గా ఎక్కువగా దగ్గరవ్వట్లేదు. హగ్స్ ఇవ్వడం అయితే పూర్తిగా మానేసాడు. నిన్నటి ఎపిసోడ్ లో సిరి హగ్ ఇవ్వమని అడిగేసరికి ఇవ్వాలా వద్దా అని కాసేపు ఆలోచించాడు.

Akhanda : దేశ విదేశాల్లో బాలయ్య క్రేజ్.. ఖండాతరాలు దాటిన ‘అఖండం’

సిరి మళ్ళీ అడగడంతో షణ్ను తడబడుతూనే ఇది కేవలం ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అని కెమెరాల వంక చూసి చెప్పి సిరికి హగ్ ఇచ్చాడు. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని గట్టిగా హత్తుకుంది సిరి. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే చిన్నగా అనుకుంది సిరి. దీంతో మరోసారి వీళ్లిద్దరి కౌగిలింత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీళ్ల హగ్గులు చూసిన ప్రియాంక తనకు కూడా ఓ హగ్గివ్వమని షణ్నుని కోరింది. కాని షణ్నుమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.